Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, సినీ నటుడు ధనుష్ 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.18 సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట విడాకులు తీసుకుని విడిపోతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ జంట తీసుకున్న నిర్ణయానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలా ఈ జంట విడిపోవడంతో ఎంతోమంది అభిమానులు ఎలాగైనా వీరు కలవాలని ఆశపడుతున్నారు. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో ధనుష్ తండ్రి కస్తూరి రాజా,ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ కూడా ఒకసారి ఈ విషయంపై ఆలోచించుకోవాలని వీరికి సూచనలు చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఇలా ఈ జంట విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో రజనీకాంత్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా ఆడియో ఫంక్షన్ లో భాగంగా రజినీకాంత్ తన అల్లుడు ధనుష్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధనుష్ ఒక మంచి తండ్రి.. మంచి అల్లుడు:
ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ హీరో ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ధనుష్ చాలా మంచి అబ్బాయి తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని దేవుళ్ళుగా భావిస్తారు. ధనుష్ ఒక మంచి కొడుకుగా, భర్తగా, తండ్రిగా మంచి ప్రతిభ ఉన్నవాడు అంటూ రజనీకాంత్ అల్లుడు ధనుష్ గురించి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని ధనుష్ నిర్మించడం విశేషం.
Apart From Trolls. Feeling sad For Rajini. Stay Strong ???? #Dhanush #DhanushDivorce #Divorce @dhanushkraja#Beast #Thalapathy66 @actorvijay pic.twitter.com/3brl7XYWNu
— பாண்டி????❤???? (@PandiyanKpm) January 18, 2022






























