సూపర్ స్టార్ మహేష్ బాబు క్రెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రిన్స్ ఏది చేసినాగాని అది సూపర్ గానే ఉంటుంది. అయన నటనతో, అభినయంతో అభిమానుల మనసుని దోచుకున్నాడు. మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఎంత అయిన అందగాడు కదా మరి. అయితే చాలామంది అభిమానులకు మహేష్ బాబుని రియల్ గా చూడాలని, కలవాలని, ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. అలాగే మహేష్ బాబు నివసించే ఇల్లు ఎలా ఉంటుందో అని రకరకాల ఉహాగానాల్లో విహరిస్తూ ఉంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో ఇంటికి సంబంధించిన ఫోటోలు పెడితే చూడడం తప్పా, ఎవరికీ అసలు ఆ ఇంటి లోపల ఎలా ఉంటుందో అనే విషయాలు తెలియవు. సినిమాల్లో మహేష్ బాబు నివసించే ఇల్లు చుస్తే ఒక ప్యాలస్ లాగా ఉంటుంది కదా. మరి నిజం జీవితంలో కూడా ఈ శ్రీమంతుడు ఇల్లు రాజ్ మహల్ లాగానే ఉంటుందో లేదో తెలుసుకుందాం..

ఇటీవల కొన్నిరోజుల క్రితం మహేశ్‌ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసారు. అవి చూసిన అభిమానులు వావ్.. సూపర్ ఉందిగా హౌస్ అని అనకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అంత అందంగా డిజైన్ చేయించారు ఇంటిని. ఇంటి బయట ఉన్న పెద్ద గార్డెన్‌ అందరిని ఆకర్షింపచేసింది. అలాగే స్విమ్మింగ్ చేయడానికి బయటకు ఎక్కడకు వెళ్లకుండా ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి తగ్గట్టుగా, కట్టించుకున్న అందమైన స్విమ్మింగ్‌ పూల్‌ , అలాగే మహేష్ గాని, తన తనయుడు గాని ఆడుకోవడానికి వీలుగా ఉండడానికి ఒక గేమ్స్‌ రూమ్‌ కూడా ఇంట్లో ఉంది, చాలా పెద్దదిగా కనిపించే లివింగ్ ఏరియా‌, ఇంట్లోనే వర్క్ ఔట్స్ చేయడానికి జిమ్‌, వర్క్ ప్లేస్‌,అలాగే ఎంతో అందంగా అలంకరించిన దేవుడి మందిరం, మహేష్ కూతురు డాన్స్ చేయడానికి అనువుగా ఉండే ఒక పెద్ద గది.. ఇలా ఇంకా ఎన్నో సౌకర్యాలతో ఇంటిని డిజైన్ చేయించారు ఈ దంపతులు.

ఒక్కోసారి ఈ ఇల్లు చూస్తుంటే ఇది నిజంగా ఇల్లేనా లేక రాజభవనమా అన్న అనుమానం కూడా కలుగుతుంది. నిజానికి మహేష్ బాబు ఎంతయినా రాజకుమారుడు కదా..మరి రాజకుమారుడు ఇల్లు అంటే సాదాసీదాగా ఉంటే ఎలా చెప్పండి. అందుకనే రాజకుమారుడు నివసించడానికి ఒక రాజభవనాన్ని కట్టించుకున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మహేష్ బాబు ఇంటిని చూసి అయన అభిమానులు ఆనందపడుతున్నారు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here