Supritha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ విపరితమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయో లేక ఈమె దూరంగా ఉన్నారో తెలియదు కానీ సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.

సోషల్ మీడియా వేదికగా తన కూతురు సుప్రీతను పరిచయం చేస్తూ ఈ తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. ఇలా వీరు సోషల్ మీడియాలో చేసే రచ్చ కారణంగా ఏకంగా హీరోయిన్ రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇక సుప్రీత కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.
ఇక ఈమెకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే వెకేషన్ కు వెళ్తూ బాగా చిల్ అవుతూ ఉంటారు. ఇలా తరచూ వెకేషన్ లకి వెళ్లడం అక్కడ షాపింగ్, రెస్టారెంట్లకు వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో షేర్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం థాయిలాండ్ వెకేషన్ లో ఉన్నటువంటి సుప్రీత ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Supritha: తేడా వస్తే అంతే సంగతులు…
ఇలా తన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో చూస్తే ఈమెకు ఎంతో ధైర్యం ఉందని చెప్పాలి. ఏకంగా పులి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు. ఎలాంటి భయం లేకుండా నవ్వుతూ ఓ పులి పిల్ల దగ్గరకు వెళ్లి దానిని నిమురుతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినటువంటి నెటిజెన్స్ సుప్రీతకు చాలా ధైర్యం ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తేడా వస్తే అంతే అంటూ కామెంట్ చేస్తున్నారు.



























