క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో వదినగా, అక్క పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నారు. తన కూతురు సుప్రీతతో కలసి ఈమె చేస్తున్న రచ్చ మామూలుగా ఉండదు.

తన కూతురుతో కలిసి చిన్నపిల్లలా ఈమె చేసే డాన్సులు, సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు పెద్దఎత్తున వైరల్ గా మారేవి. ఇకపోతే సురేఖ వాణి భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.అప్పటినుంచి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున కథనాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే సురేఖవాణి తన రెండో పెళ్లి విషయం పై స్పందించి తీవ్రస్థాయిలో ఖండించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని చెప్పింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు సురేఖవాణి రెండవ వివాహం చేసుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి నీలి రంగు చీర కట్టుకొని సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో ఆమె మంగళసూత్రం వేసుకోవడంతో ఈమె రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ఏదైనా సినిమా షూటింగ్ కోసం ఇలా మంగళసూత్రం వేసుకుందా.. లేక నిజంగానే రెండవ వివాహం చేసుకుందా అంటూ నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు.































