Supritha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో గ్లామరస్ ఫోటోలను, తన తల్లితో కలిసి చేసే వీడియోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సుప్రీత ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే చాలా మంది నెటిజన్లు ఈమె ప్రేమ గురించి, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అనే విషయం గురించి పలుమార్లు అడిగిన నో అని సమాధానం చెప్పారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతో ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరో బ్రేకప్ న్యూస్ వినాల్సి వస్తుంది:
ఇక తన ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కూడా ఈ ఫోటోని షేర్ చేయడంతో చాలా మంది ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కంగ్రాట్స్ చెప్పగా మరికొందరు తొందరలోనే మరొక బ్రేకప్ న్యూస్ వినాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.






























