Surekha Vani -Supritha: సురేఖ వాణి సుప్రీత పరిచయం అవసరం లేని పేరు.సురేఖ వాణి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అందరిని మెప్పించారు. ఈమె తన కుమార్తె సుప్రీతను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశారు. ఇలా సోషల్ మీడియాలోకి సురేఖ వాణి ఎంటర్ అయిన తర్వాత ఈమె సినిమాలను పూర్తిగా తగ్గించిందని చెప్పాలి.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన హవా కొనసాగిస్తున్నారు. తన కుమార్తె సుప్రీతతో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ సోషల్ మీడియాలో వీరిద్దరూ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇక సోషల్ మీడియాలో ఏదైనా ఒక కొత్త పాట ట్రెండ్ అవుతూ ఉంటే వాటికి తప్పనిసరిగా వీరిద్దరూ రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా కిరణ్ అబ్బవరం నేహా శెట్టి నటిస్తున్నటువంటి రూల్స్ రంజన్ సినిమా నుంచి సమ్మోహనుడా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ పాటకు సురేఖ వాణి సుప్రీత ఇద్దరు కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. చీర కట్టులో తల్లి కూతుర్లు ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ మరి డాన్స్ చేశారు.

Surekha Vani -Supritha: చీర కట్టులో రెచ్చిపోయిన తల్లి కూతుర్లు…
ఈ విధంగా వీరిద్దరూ డాన్స్ చేసినటువంటి ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సుప్రీత ఇప్పటివరకు సినిమాలలోకి అడుగుపెట్టలేదు. ఇలా ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.