Hero Karthik: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీతాకోకచిలుక వంటి చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కార్తీక్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో ఆయన వెండితెరకు కనుమరుగయ్యారు. అయితే ఈయన కెరీర్ పతనం కావడానికి కొందరు హీరోలు రాజకీయాలు చేసి ఇతనిని ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

హీరో కార్తీక్ విషయంలో అతని కెరీర్ గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోయినా తనని ఇండస్ట్రీలో ఎదగకుండా కొందరు హీరోలు తొక్కేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా అమల బ్రదర్ సురేష్ చక్రవర్తి ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సురేష్ చక్రవర్తి కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలో పలువురి హీరోలకు మేనేజర్ గా వ్యవహరించేవారు. అనంతరం ఆయన హీరోగా కూడా పలు సినిమాలలో చేసినప్పటికీ ఆయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ చక్రవర్తి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ హీరో కార్తీక్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

ఎవరు కారణం కాదు..
ఈ క్రమంలోనే హీరో కార్తీక్ కెరియర్ పతనం కావడానికి ఇండస్ట్రీలో కొందరు హీరోలే కారణమని వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉందని ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు సురేష్ చక్రవర్తి సమాధానం చెబుతూ మనకు మంచి జరిగినా, చెడు జరిగినా అది మన వల్లే వస్తుందని సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే హీరో కార్తీక్ సినీ కెరియర్ పతనం కావడానికి ఎవరూ కారణం కాదని ఆయనే కారణం అని పరోక్షంగా సురేష్ చక్రవర్తి వెల్లడించారు.































