Suriya: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో కోలీవుడ్ హీరో సూర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు స్ట్రైట్ గా ఒక తెలుగు సినిమా కూడా చేయలేదు కానీ తెలుగులో మాత్రం ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. సూర్య తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదలవుతాయి ఇక్కడ కూడా ఆ సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకుంటాయి.

ఇలా తెలుగులో కూడా సూర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సూర్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహేష్ బాబు తాను టెన్త్ వరకు క్లాస్మేట్స్ అంటూ సూర్య షాకింగ్ విషయాలు రివీల్ చేశారు.
తాను మహేష్ బాబు యువన్ శంకర్ రాజా ముగ్గురం కలిసి చెన్నైలోని సెయింట్ బీడ్ స్కూల్ లో టెన్త్ వరకు చదువుకున్నామని తెలిపారు. మే ముగ్గురం చాలా మంచి స్నేహితులం ఎప్పుడు మేము మాట్లాడుకున్న మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే వారం మా ఇంట్లో ఏదైనా స్పెషల్ చేస్తే ఒకరి కోసం మరొకరు తీసుకువెళ్లే అంత బాండింగ్ మా మధ్య ఉండేదని సూర్య తెలియచేశారు.
మహేష్ తో సినిమా ఛాన్స్ రాలేదు..
ఇక మేము చదువుకునే రోజుల్లో ఎప్పుడు కూడా మా మధ్య సినిమాలకు సంబంధించిన విషయాలు చర్చకు రాలేదని సూర్య తెలిపారు. ఇక ఇప్పటివరకు తనకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమాలలో నటించే అవకాశం రాలేదని సూర్య ఈ సందర్భంగా మహేష్ బాబుతో తనకున్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు మహేష్ ఎక్కడ కూడా వారి ఫ్రెండ్షిప్ గురించి చర్చించలేదు త్వరలోనే ఈయన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.



























