AP politics: ఏపీ ఎన్నికలు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ విషయం గురించి ఎన్నో జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహించారు.

ఇలా ఇప్పటికి ఎన్నో సర్వేలు చేసినప్పటికీ కూడా అన్ని సర్వేలలో కూటమిదే విజయమని తేల్చేసాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ పరిపాలన చూసినటువంటి ప్రజలు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారని అందుకే ఈసారి ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలందరూ సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేలలో కూడా కూటమిదే విజయం అని తేల్చేశాయి అయితే తాజాగా మరో సమస్త ఎన్నికల సర్వే నిర్వహించారు. రైజ్ ( ఇండియన్ పొలిటికల్ మేనేజ్ మెంట్ ) సంస్థ ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుందనే అంశంపై చేపట్టిన ఎన్నికల ఫలితాలను విడుదల చేసింది.
కూటమిదే విజయం..
ఏపీ ఎన్నికలపై ఇండియన్ పోలిటికల మేనేజ్ మెంట్ అనే సంస్థ 34రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. 662 మంది సిబ్బంది ద్వారా 3, 82, 576 శాంపిల్స్ సేకరించి సర్వే ఫలితాలను తెలియజేసిన ఈ సర్వే ప్రకారం కూటమిదే విజయమని మరోసారి రైజ్ సమస్థ కూడా కూటమిది విజయమని తేల్చేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కూటమి 97స్థానాల్లో విజయం సాధిస్తుందని, 108- 120సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. వైసీపీ 34 సీట్లను కైవసం చేసుకుంటుందని..ఆ పార్టీకి 41 – 54 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.





























