Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఈయన తన నటన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అటువంటి చిరంజీవి ప్రస్తుతం తన కుమారుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించారు.

చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఈయన పెద్ద కుమార్తె సుస్మిత తర్వాత రామ్ చరణ్ అనంతరం చిన్న కుమార్తె శ్రీజ ఈ ముగ్గురు ప్రస్తుతం వారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవికి ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టం అనే విషయం గురించి చరణ్ శ్రీజ సుస్మిత పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇక చిరంజీవికి అందరికంటే తన చిన్న కుమార్తె శ్రీజ అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాలలో తెలియచేశారు. శ్రీజ కోసం తన తండ్రి ఏం అడిగినా కాదనరని సుస్మిత ఓ సందర్భంలో తెలిపారు. ఇక అమ్మకు చరణ్ అంటే చాలా ఇష్టం నేనేమో పెద్దదాన్ని కావడంతో నాకు కొన్ని రెస్పాన్సిబులిటీస్ ఇచ్చేవారని సుస్మిత కూడా తెలిపారు..
శ్రీజ అంటేనే ఇష్టమా…
ఇక శ్రీజ సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాన్నకు తాను అంటేనే చాలా ఇష్టమని తెలిపారు. ఇక నన్ను ఎంత ప్యాంపర్ చేసినప్పటికీ ఒక విషయం మాత్రం చెప్పారని అది ఎప్పటికీ మర్చిపోకూడదని తన తండ్రి తనకు సలహా ఇచ్చినట్టు తెలిపారు. మనం మన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలతో ఉండాలని వారు మనకంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండే వారి కాళ్లకు దండం పెట్టిన తప్పు లేదని ప్రతి ఒక్కరితో ఎంతో మర్యాదగా నడచుకోవడం క్రమశిక్షణతో ఉండడం మర్చిపోకూడదంటూ తనకు సలహాలు ఇచ్చినట్లు శ్రీజ వెల్లడించారు.



























