Sushmita Sen: మాజీ విశ్వసుందరిగా బాలీవుడ్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుస్మితాసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈమె గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

ఇలా ఈమె గుండెపోటుకు గురయ్యానంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ అందరిని కాస్త ఆందోళనకు గురిచేసాయి. అయితే ఇది జరిగి చాలా రోజులు అయిందని ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని సుస్మితాసేన్ తెలియజేశారు. అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలియగానే ప్రపంచం నలమూలల నుంచి తనపై ఇంత ప్రేమ అభిమానాలను చూపించినటువంటి అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక తాను గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానని తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు 95% ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయని వైద్యులు వెల్లడించారు. ఆ సమయంలో ముంబైలోని నానావతి హాస్పిటల్ వైద్యులు ఇతర సిబ్బంది ఎంతో కష్టపడి తనకు సర్జరీ నిర్వహించారని ఈమె తెలియజేశారు.

Sushmita Sen: ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు…
ఈ క్రమంలోనే తనను కాపాడినటువంటి వైద్యులకు తాను క్షేమంగా ఉండాలని కోరుకున్నటువంటి అభిమానులకు ఈమె ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే తాను అనారోగ్యానికి గురయ్యానంటూ చేసిన పోస్ట్ చూసి ఇప్పటికి చాలామంది అభిమానులు తనకు గెట్ వెల్ సూన్ అనే పోస్టులు పెడుతున్నారని, ఇలా మీ ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ సుస్మిత సేన్ ఈ సందర్భంగా తెలియజేశారు.
































