Pawan Kalyan: జూన్ 4 వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలబడనున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాల పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అనే విధంగా ఉన్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గ ఫలితాల గురించి ఇటు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈయనకు పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అయితే పలు సర్వేలలో పవన్ కళ్యాణ్ ఓటమిపాలు అవుతున్నారని తెలియజేశాయి. అయితే చాలామంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని బెట్టింగులు కూడా వేస్తున్నారు.
ఇక పిఠాపురంలో టిడిపి నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక పిఠాపురంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఈయన ధీమా వ్యక్తం చేశారు.
పవన్ గెలుపు ఖాయం…
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుస్తారని అలా ఆయన కనుక గెలవకపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గెలుపు గురించి వర్మ కామెంట్లు చేయడంతో పవన్ కళ్యాణ్ గెలుస్తారన్న ధీమా అభిమానులలో పెరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే గారి తాలూకా వర్సెస్ డిప్యూటీ సీఎం తాలూకా అంటూ పెద్ద ఎత్తున నేమ్ బోర్డ్ లు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి పిఠాపురం ఎవరి సొంతం అవుతుందనేది తెలియాల్సి ఉంది.





























