Swami Vivekanandha : స్వామి వివేకానంద అనగానే అమెరికాలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ లో ప్రసంగం గుర్తుకు వస్తుంది. యువతకు ఎంతో ఆదర్శప్రాయమైన వివేకానంద గారు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని లాల్ భాహద్దుర్ శాస్త్రి, ఇక స్వాత్రంత్ర సమరంలో బ్రిటిష్ వారిని భయపెట్టి స్వాత్రంత్రం తెచ్చిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇలా ఎంతో మంది మహనీయులకు అలాగే నికోలా టెస్లా అనే శాస్త్రావేత్తకు కూడా ఈయనే స్ఫూర్తి. అలాంటి స్వామి వివేకానందా జీవిత విశేషాలు చాలా మందికి తక్కువగా తెలుసు. అలాగే ఆయన అతి చిన్న వయసులోనే మరణించారు.

ధనిక కుటుంబంలో పుట్టి వివేకానంద సన్యాసిగా ప్రయాణం…
హై కోర్ట్ న్యాయవాది భార్య భువనేశ్వరికి కలలో పరమశివుడు కనిపించి నీ కొడుకుగా పుట్టాలని అనుకుంటున్నా అని చెప్పాడట. ఆ తరువాత జనవరి 12 మకర సంక్రాంతి రోజున 1863 లో వివేకానంద గారు జన్మించారు. తల్లి ధార్మిక మహిళ కావడం వల్ల ధార్మికత చిన్నప్పటి నుండి అలవడింది. ఆర్థికంగా బాగున్న కుటుంబం కావడం వల్ల దాన దార్మాలు నిత్యం ఇంట్లో జరుగుతూ ఉండేవి. వివేకానంద మొదటి పేరు నరేంద్ర దత్త. ఇక చుట్టూ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ మీద అనేక ప్రశ్నలు వచ్చేవి నరేంద్రుడికి అలా వాటి అన్వేషణలో కలలో ఒక ధనిక వ్యక్తిగా ఉండటం లేక ఒక సన్యాసిగా జీవించడం కనిపించి రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి రావడంతో వివేకానంద సన్యాసం తీసుకున్నారు.

ఇక రామ కృష్ణ పరమహంస గారిని మహంకాళి అమ్మవారి గుడి దగ్గగర కలిసి మీరు భగవంతుడిని ఈ విశ్వంలో ఎపుడైనా చూసారా అని అడిగితే రామకృష్ణ పరమహంస గారు చూసానని చెప్పడంతో ఇక ఆయన వద్ద శిష్యరికం చేసారు. ఇక గురువు అడుగుజాడల్లో ప్రభావితం అయిన వివేకానంద విశ్వంలో ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడని తెలుసుకున్నాడు. ఇతరులకి సహాయం చేయడమే మనం భగవంతుణ్ణి పూజించడం అని తెలుసుకున్నారు.

కొత్తగా వచ్చే విద్యార్థులకు బోధనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల గురించి రచనలను అందజేస్తూ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసారు. ఇక రామకృష్ణ పరమహంస మరణం తరువాత మఠం బాధ్యతలను తీసుకున్న స్వామి వివేకానంద అమెరికాలో జరగనున్న ప్రపంచం మతాల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుని అక్కడికి వెళ్లి ప్రసంగించారు. చికాగో లోని పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ లో సెప్టెంబర్ 11 1893 న ఆయన ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడం అప్పట్లో కొత్త ట్రెండ్. ఇచ్చిన కొద్ది సమయంలో ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు, ఆయన ప్రసంగిస్తుంటే మొత్తం సభ ఎంతో ఆసక్తిగా విన్నారు. ఇక స్వామి వివేకానంద గారు అక్కడి నుండి వచ్చాక రామకృష్ణ మిషన్ ను ఏర్పాటు చేసి సేవలను అందించారు. ఇక వివేకానంద గారు జులై 4 1902 లో ధ్యానం చేస్తూ మరణించారు. అయితే ఆయన మరణాన్ని కూడా ఆయన శిష్యులకు రెండేళ్ల ముందే చెప్పారు. ఇక 39 ఏళ్ల వయసులో స్వామి వేవికానంద మరణించినా ఆయన తత్త్వ భోధనలు ఇప్పటికీ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.































