పాఠశాల విద్యార్థినిపై స్వీపర్ అత్యాచారయత్నం.. టాయిలెట్లోనే ఘోరంగా..!

0
595

మహిళల రక్షణ కొరకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు మారడం లేదు. ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చట్టాలు అంటే అస్సలు లేక్కే లేనట్టుగా వ్వవహరిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనిపించిందంటే చాలా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలవ్వ వరకు వవరినీ వదలడం లేదు

తాజాగా ఇలాంటిదే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. టాయిలెట్ కు వెళ్లిన బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.. ఆపాఠశాలకు చెందిన స్పీపర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది తాజాగా ఓ స్కూల్ విద్యార్థినిపై ఆ పాఠశాలలో పని చేసే స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. టాయిలెట్‌కు వెళ్లిన బాలికపై స్వీపర్ ఈ దారుణానికి తెగబడ్డాడు. ఆ స్కూల్ వారణాసిలో ఉంది.

సింకు అనే వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలకు చెందిన ఓ మైనర్ బాలిక క్లాసులు జరుగుతున్న సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లింది. అతడు ఆ సమయంలో టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడు. అదే సమయంలో టాయిలెట్ వెళ్లిన ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ బాలిక భయంతో వణికిపోతూ.. కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది.

ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడే ఉన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.