Syamala: నా చేతి వంట తిని నా భర్త మీదే చీటింగ్ కేసు పెట్టింది… యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

0
127

Syamala: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్లుగా గుర్తింపు పొందిన వారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. మొదట బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయమైన శ్యామల ఆ తర్వాత యాంకర్ గా మారి ఎన్నో టీవీ షోలో యాంకరింగ్ చేస్తూ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించింది.

Anchor Syamala: నూత

ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న శ్యామల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకర్ గా సందడి చేస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పటికప్పుడు తన గురించి తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల తన కుటుంబ సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

19 ఏళ్ల వయసులోనే నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆ సమయంలో తల్లితండ్రులు లేకుండానే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అంతేకాకుండా తన తల్లి పెళ్లి చూడలేదన్న బాధ ఇప్పటికే ఉందని తెలిపింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకు స్వయంగా తన తల్లి ఇంటికి రావడంతో ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా తన భర్త నరసింహారెడ్డి గురించి మాట్లాడుతూ నరసింహా అన్ని విషయాలలో తనకి చాలా సపోర్టివ్ గా ఉంటాడని తెలిపింది.

Anchor Syamala: నూతన గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్యామల.. వీడియో వైరల్!

Syamala: వెన్నుపోటు పొడుస్తారు..

అలాగే లాక్ డౌన్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి స్పందిస్తూ.. నాకు తెలిసిన ఒక ఆవిడ ఇంటికి వస్తే స్వయంగా నేనే వంట చేసే భోజనం పెట్టాను. కానీ నా చేతి వంట తిని నా భర్త మీదే చీటింగ్ కేసు పెట్టింది. అయితే ఆమె చేసిన ఆరోపణలలో నిజం లేదని తర్వాత రుజువయింది. ఇలా మన అనుకునే వాళ్లే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.