T20 World Cup : టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరింది. ఇండియా కూడా అష్టకష్టాలు పడి సెమిస్ కు చేరుకున్న తరుణంలో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే సెమిస్ కు రెండు గ్రూప్‌ల నుంచి టాప్-4 జట్లు చేరుకున్నాయి. నవంబర్ 9 బుధవారం నాడు జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 10 గురువారం నాడు రెండో సెమీస్ ఆటలో ఇండియా తో ఇంగ్లండ్ అమీతుమీ ఆడనుంది. ఇంత ముఖ్యమైన సెమీస్ క్రికెట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగలనుంది.

ప్రాక్టీస్ లో గాయంతో బాధపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ…
మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం వినిపిస్తోంది. అడిలైడ్ గ్రౌండ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ కుడి చేతికి గాయమై బాధతో విలవిల్లాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. వెంటనే విషయం తెలుసుకున్న జట్టుకు సంబంధించిన ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరికి పరుగు పరుగున వెళ్లిపోయి అతనికి చికిత్స అందించారు. అయితే రోహిత్ గాయం ఎంత తీవ్రంగా ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.

కాకపోతే ఇంగ్లాండ్ వంటి శక్తివంతమైన జట్టుతో ఆడే సమయంలో హిట్ మ్యాన్ ఇలా గాయలపాలవడం కొంచెం ఆందోళన కలిగించే అంశం. T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో రోహిత్ ఇంతవరకు పేలవమైన ప్రదర్శన చూపించి నిరాశ పరిచాడు. కెప్టెన్ గా టీం విజయంలో భాగస్వామి అవుతున్నా వ్యక్తిగత ప్రదర్శనలో గత ఐదు మ్యాచుల్లో 4, 53, 15, 2, 15 పరుగులకే పరిమితమాయ్యడు. ఏది ఏమైనా సెమిస్ లో మంచి ఆట తీరు కనబరుస్తాడని ఆశిస్తున్న అభిమానులు రోహిత్ శర్మ త్వరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.































