T20 World Cup: ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ మ్యాచ్ పై ప్రతి ఒక్కరు తీవ్ర స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లలో భాగంగా టీమిండియా హోరాహోరీగా పోటీ పడుతూ సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. ఇక సెమి ఫైనల్ లో టీమిండియా మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమైంది.ఎలాగైనా ఈసారి కప్ కొట్టాలన్న కసితో టీం ఇండియన్ క్రికెటర్స్ కసరత్తుల నిర్వహిస్తున్నారు.

ఇకపోతే గురువారం టీమిండియా ఇంగ్లాండ్ మధ్య హోరా హోరీగా సెమి ఫైనల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ మొయిన్ అలీ టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన షాట్లతో ఆట ఆడుతున్నారని ఈయన తెలిపారు.
గతంలో ఇంగ్లాండ్ జట్టుపై ఈయన విరుచుకుపడిన విషయాన్ని గుర్తు చేసుకొని అతని ఆట తీరు పట్ల ప్రశంసలు కురిపించారు.మూడో టి20 మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ను తానే అవుట్ చేశానని అయితే అప్పటికే ఆయన సెంచరీ చేసి అలసిపోవడం వల్లే తాను అవుట్ చేశానని ఈ సందర్భంగా ఆలీ సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

T20 World Cup: ప్రపంచంలో అతనే బెస్ట్..
ఇక ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సూర్య కుమార్ యాదవ్ ఆడిన ఆట తీరు మాత్రం అద్భుతం. తన ఆటతో టి 20 మ్యాచ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని తెలియజేశారు. ప్రపంచంలో అతనే బెస్ట్ అని పేర్కొన్నటువంటి ఆలీ సెమి ఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టు సూర్యకుమార్ యాదవ్ ను కట్టడి చేస్తామంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నటువంటి సూర్య కుమార్ యాదవ్ సెమీఫైనల్స్ లో కూడా ఇంగ్లాండ్ పై అదే దూకుడు ప్రదర్శిస్తాడా? లేకపోతే ఇంగ్లాండ్ బౌలర్లకు తన వికెట్ ను కానుకగా ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.































