నా భర్త కూడా గౌరవం ఇవ్వాల్సిందే అంటున్న హీరోయిన్ తాప్సీ..

0
290

జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ పన్ను.. తాప్సీ పుట్టి పెరిగింది న్యూఢిల్లీ. చిన్న తనం నుండి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, మరియు తన యొక్క విద్యాభ్యాసం కూడా మంచి ఉత్తీర్ణత అన్నిటిలో ముందు ఉండేది ఈ సుందరి. మాధ్యమిక విద్య అనంతరం మోడలింగ్ చేసి నటి అవ్వాలి అనే కోరికతో ఆ వైపు అడుగులు వేసింది తాప్సీపన్ను. తెలుగులో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ సరసన “జుమ్మంధి నాదం” సినిమాలో మొట్ట మొదటి సారిగా తెలుగులో నటించడం జరిగింది. ఆ సినిమాలో తాప్సీ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వత కొన్ని సినీమా ఛాన్స్ లు కూడా రాబట్టుకుంది ఈ అమ్మడు. అలా అడపా దడపా సినీమాలు చేస్తూనే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వత కొద్దిగా సన్నబడి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత ఈ భామ బాలివుడ్ లో ఎంటర్ అయ్యింది. ఆ మధ్య పింక్ మూవీ తో బిగ్ బి అమితాబ్ పక్కన కూడా నటించింది.

అంతే కాకుండా తాప్సీపన్ను స్త్రీతత్వ వాదం పైన, మహిళలకు సంబంధించిన విషయాలలో తన యొక్క అభిప్రాయాలను వ్యక్త పరచడంలో ముందుంటుంది. ప్రతి ఒక్క మహిళకు తన కంటూ వ్యక్తి గత స్వేచ్చ ఉండాలి అని తాప్సీ అభిప్రాయం. మహిళలను సమానంగా చూడాలని, ఆశిస్తేనే తప్ప కొంచెం కూడా అదనపు అంశాలు కావాలని అనుకోను అని ముక్కుసూటిగా చెప్పింది. నన్నెప్పుడూ నా ప్రతిభ ఆధారంగానే జడ్జ్ చేయాలి అనుకుంటాను. గౌరవం అన్న విషయంలో నేను అస్సలు రాజీ పడను, నా జీవిత భాగస్వామి కూడా ఈ విషయంలో రాజీ పడాలని అస్సలు అనుకోను, ప్రేమ వచ్చి పోతుంటుంది కానీ ఒక్కసారి గౌరవం పోతే తిరిగి పొందలేము అంటూ అని స్పష్టంగా చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here