Tag Archives: Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ లో మరో ఉగ్రదాడి ముప్పు.. హెచ్చరికలు జారీ..!

అమెరికా తన సైనిక స్థావరాలను, సైనికులను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించుకున్న దగ్గర నుంచి ఆ దేశంలో పరిస్థితితులు రోజురోజుకు దిగజారాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ల దేశం నుంచి మరో దేశం వెళ్తేందుకు విశ్రప్రయత్నాలు చేస్తున్నారు.

అక్కడ ఉన్న మహిళలపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు వెతుకుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ రాక్షసత్వం ఎంతగా ఉందో అని. ఆ దేశం నుంచి మరో దేశానికి రావాలంటే అక్కడ ఒక్కటే మార్గం అది కూడా కాబూల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే. అక్కడ నుంచి విదేశీయులు అయినా.. అక్కడి పౌరులు అయినా దేశం దాటడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

ఉగ్రవాదదాడులు ఎయిర్ పోర్టే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయినా అక్కడకు ప్రజలు తండోపతండాలకు వస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులు జరుగుతున్నా సరే కాబూల్ ఎయిర్ పోర్ట్ వదిలి వెళ్ళటం లేదు. ఒకపక్క కాబూల్ ఎయిర్ పోర్టులో ఉగ్రదాడి జరుగుతుందని అక్కడ ఉన్న పౌరులంతా దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముందే హెచ్చరికలు జారీ చేసినా అక్కడి నుండి ప్రజలు వెళ్లిపోయిన దాఖలాలు లేవు.

ఫలితంగా కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 180 మందికి పైగా ప్రాణాలను పోగొట్టుకోగా, 150 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. అందులో 169 వరకు ఆఫ్గాన్ పౌరులే ఉన్నారని అక్కడ అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో తాలిబన్లు కూడా 28 మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇలా ఉండగా వాస్తవంగా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని అంచనా. ఇదిలా ఉండగా.. మరోసారి కూడా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

తాలిబన్లకు బిగ్ బాస్ షో కు సంబంధం ఏమిటి..? తెలుసుకోండి..?

మొదట ఈ బిగ్ బాస్ రియాల్టీ షో అనేది హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టింది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ లోకి అడుగు పెడుతోంది. కరోనా నేపథ్యంలో ఈ షో కొంచెం లేట్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడింది.

బీగ్ బాస్ – 5 సీజన్ ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది. ఇప్పటికే .. నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ షో సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నదని ట్వీట్ చేసారు. ఇదిలా ఉండగా.. ఆప్ఘనిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అష్రఫ్ ఘనీ పరారవ్వడంతో అక్కడ వారి అరాచకాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

బిగ్ బాస్ షోకు.. ఆఫ్ఠనిస్తాన్‌కు సంబంధం ఉందట. అదేంటంటే.. బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున అప్పట్లో విడుదలైన ఖుదా గవా సినిమాలో రెండో హీరోగా నటించారు. అయితే ఈ సినిమా మొత్తం అఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. దీనిలో అమితాబ్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో నాగార్జున రజా మీర్జా పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

తర్వాత నాగార్జున నటించిన గగనం సినిమా కూడా అఫ్ఘనిస్తాన్ .. నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా నాగార్జున నటించిన సినిమాలు ఈ రెండు.. మరి కొన్ని హిందీ సినిమాలో కూడా అఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కయి. అందుకే బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు.. నాగార్జున నటించిన సినిమాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన సన్నివేశాలకు సంబంధించి సీన్ లను ఇలా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆ ఉత్తరంతో చలించిపోయిన ఏంజెలినా జోలి.. ఆఫ్ఘాన్ ల కోసం నిలబడిన నటి.. !

బాహ్య ప్రపంచానికి, వివాదాలకు దూరంగా ఉంటూ.. హాలీవుడ్​ కు చెందిన ప్రఖ్యాత నటి ఏంజెలినా జోలి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె పలువురు సెలెబ్రెటీలకూ ఆమె రోల్​మోడల్ గా ఉంది. ఇప్పటి వరకు తనకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు. అయితే ఆమె ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ తెరిచి సంచలన ప్రకటన చేసింది. ఇలా చేయడానికి గల కారణం ఓ ఉత్తరం. ఓ ఉత్తరం ఆమెను కదిలించి అకౌంట్ ను ఓపెన్ చేయించిందని తెలిపింది.

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే.. తాను ఆఫ్టనిస్థాన్ లో ఉద్యోగం చేసేదానిని అని.. తాలిబన్ల రాకతో ఉద్యోగం పోయి రోడ్డున పడ్డానని.. మాకు హక్కులు ఉండేవని.. తాలిబన్ల రాకతో అంతా తలకిందులు అయిపోయిందని.. ఆ ఉత్తరంలో ఓ యువతి వాపోయింది. వారిని చూసి తాము భయపడుతున్నామని..మా కలలన్నీ నీరుగారిపోయాయని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు మారారని కొందరు చెబుతున్నారు… నేనలా భావించడం లేదు.

ఇప్పుడు మా జీవితాలు చీకటి మయమయ్యాయి. స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలైపోయాం.. అంటూ ఆమె కన్నీటితో వ్యాఖ్యలను రాసినట్లు రాసింది. అంతే ఉత్తరం చదివి చలించిపోయింది ఏంజెలినా. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా పోరాడతానని.. వారి గళాన్ని ప్రపంచానికి వినిపిస్తానని హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి అన్నారు. దీని కోసమే ఆమె సోషల్ మీడియాలో ఖాతా తెరిచారు. అఫ్ఘనిస్తాన్ వాసులు తమ బాధలను పంచుకోవడినికే ఈ ఖాతాను అంకితం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

దీని ద్వారా ఆ దేశ పౌరుల బాధలను ప్రపంచానికి తెలియజేస్తానని తెలిపారు. అయితే ఆమె ఇన్‌స్టాలో ఖాతా ప్రారంభించిన వెంటనే ఏంజెలినా జోలికి 68 లక్షల మంది ఫాలోవర్లు రాగా.. తొలి పోస్టుకి 29 లక్షల లైక్స్‌ రావడం విశేషం. వాళ్ల ఆగడాలకు నాంది ఇక్కడ నుంచే మొదలైందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రెప్పపాటులో అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదు. కానీ అంతకంటే ఎక్కువగా మన పక్కనే ఉన్న పాకిస్థాన్ లో ఈ సంఘటనలు చూస్తే మీకే అర్థం అవుతుంది. అక్కడ ఓ ఏరియాలో ఎడ్ల బండి లాంటి ఓ రిక్షాలో… ఇద్దరు అమ్మాయిలు… ఓ చిన్నారి కూర్చొని వెళ్తున్నారు. అప్పుడు రాత్రి సమయం అయింది. అయినా అక్కడ ప్రజలు బాగానే ఉన్నారు కాబట్టి తమకు ఏమి కాదని ఆ అమ్మాయిలు అనుకొని ఉంటారు.

వెంటనే పరుగున వచ్చి ఓ వ్యక్తి అక్కడ రిక్షాలో ఎక్కాడు. బల్లిలా అతుక్కుపోయి.. ఓ అమ్మాయి బుగ్గపై ముద్దు పెట్టేశాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి పారిపోయాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన బాధితురాలిని, పక్కనే కూర్చున్న మరో యువతి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతదారుణామా అనుకున్నారు. ఇలా జరిగిన వెంటనే మరొకరు కూడా పక్కనే ఉన్న మరో యువతి దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె చెప్పు తీయడంతో దుండగులు పారిపోయారు.

ఇదంతా ఓ యువకుడు వీడియో తీయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముద్దు పెట్టే ముందు ఆ యువకుడు అసభ్య సంకేతాలు చేశాడని.. దీంతో వారు తలలు తిప్పుకొని ఉన్నారని తెలిసింది. వారు వేరే వైపు తిప్పుకున్నప్పుడే ఆ యువకుడు రిక్షా దగ్గరకు వెళ్లి అంత పని చేశాడు. ఇదంతా పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 14 న జరగడం విశేషం. ఇటీవల మరో దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. గుంపులో ఓ మహిళ బట్టలు విప్పి.. గాల్లో విసిరేసి రేప్ చేయబోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దర్యాప్తుకు ఆదేశించారు.

ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఇది చూసి పాకిస్థాన్ ప్రభుత్వంపై భగ్గు మంటున్నారు. అక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకూ… పాకిస్థాన్‌లో పరిస్థితులకూ ఎలాంటి తేడా లేకుండా పోయిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. లా అండ్ ఆర్డర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది మొదటి నుంచి మెతకవైఖరే అంటూ నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరు ఈ తాలిబన్లు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?

ఇప్పుడు ఎక్కడైనా నలుగురు కలిసి మాడ్లాడుకునే మాట తాలిబన్లు. ఆఫ్ఘానిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తాలిబాన్ల దాటికి చేతులెత్తేయడంతో ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాలిబాన్ల పాలనలో తాము ఉండలేము అంటూ ఇప్పటికే వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్ లో ఉన్న ఒక్కగానొక్క అంతర్జాతీయ విమానంలో దేశం విడిచి వెళ్ళిపోడానికి వేల మంది పోటీ పడటంతో అక్కడి బలగాలు గాల్లోకి కూడా కాల్పులు జరిపాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఒక దేశాన్ని తమ సైన్యంతో అదుపులోకి తీసుకున్న ఈ తాలిబన్లు ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకుందాం..

తాలిబన్ అంటే “విద్యార్థులు” అని అర్థం. వ్యవస్థాపక సభ్యుడు ముల్లా మహ్మద్ ఒమర్ విద్యార్థులు. 1994 సంవత్సరంలో ముల్లా మొహమ్మద్ ఒమర్ అంతర్యుద్ధం సమయంలో అవినీతిని సవాలు చేయడానికి డజన్ల కొద్దీ అనుచరులతో తాలిబన్‌ను స్థాపించారు. ఈ బృందం వాస్తవానికి “ముజాహిదీన్” అని పిలవబడే యోధుల నుండి సభ్యులను ఆకర్షించింది. వారు 1980 లలో ఆఫ్ఘనిస్తాన్ నుండి గతంలో USSR(ఇప్పుడు రష్యా) దళం నుంచి బయటకు వచ్చిన వారు. ఇది 1996 నాటికి దేశంలోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధించింది. 2001 లో సంవత్సరంలో వాళ్ల అరాచకాలకు అమెరికా స్పందించింది. తాలిబన్ల గ్రూపు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా సైనిక బలగాలు చెదరగొట్టాయి.

తర్వాత ముల్లా మహ్మద్ ఒమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొదట శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు. మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా, ఇతర మతస్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. తాలిబన్లకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ మదర్సాలలో చదివే వీరంతా ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు దిగారు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రశాంతంగా పాలన సాగిస్తారనుకుంటే ముజాహిదీన్ నాయకులను మించి తాలిబన్ల ఆటవిక పాలన సాగించారు.

అగ్రరాజ్యం అమెరికాపై 2001 సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్తాన్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001లో అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాటం సాగిస్తోంది అమెరికా. అయితే ఇటీవల యూఎస్ బలగాల ఉపసంహరణతో రెచ్చిపోయిన తాలిబన్లు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారని వార్తలతో ప్రజల కళ్ళముందు తాలిబన్ల క్రూర పాలన కనిపిస్తోంది. ఇంతకాలం టీషర్ట్ లు , జీన్స్ వేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ యువకులు వాటిని తీసివేసి సంప్రదాయ దుస్తులను ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థినులు ఇక తాము చదువుకునే అవకాశం ఉండదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎయిర్ పోర్టులోకి ప్రజులు గుంపుగుంపులుగా వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు ఆఫ్ఘన్ ప్రజలలో తాలిబన్ల పట్ల ఉన్న భయాందోళనలకు అద్దంపడుతున్నాయి. ఆఫ్ఘన్ లో ప్రాణ భయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్టులో దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్ పోర్టుకు క్యూకడుతున్నారు. ఇలాంటి రాక్షస పాలను సాగిస్తున్న వారి చెర నుంచి తమను రక్షించాలని వాళ్లు వేడుకుంటున్నారు.

ఖాళీ అయిపోతున్న ఆఫ్ఘనిస్తాన్.. వైరల్ ఫోటోలు

దక్షిణ మధ్య ఆసియాలో సముద్ర తీరం లేని దేశం ఆఫ్ఘనిస్తాన్. కాబూల్ రాజధాని అయినా ఈ దేశం తరచుగా దండయాత్రలకు గురవుతూ ఉంటుంది. చాలా వరకు ఈ దేశం అంతర యుద్ధాలతో విదేశ దాడులతో ఎంతో నష్టపోయింది. ప్రజలు కూడా ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఇక ఇప్పటికీ కూడా ఈ దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ దేశం మొత్తం ఖాళీగా అయిపోతుంది. అంతేకాకుండా దేశానికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తాజాగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఓ వార్త అందరి హృదయాలను కదిలిస్తుంది. అక్కడ నివసించే ప్రజలు క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టే దేశం మొత్తం వేరే దేశాలకు వలస పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఈ దేశం రక్తపాతం తోనే నిండిపోతుంది. ఇక ఇప్పటికీ ఈ దేశం ప్రశాంతంగా ఉండలేక పోతుంది.

ఈ దేశాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక దేశ అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రజలంతా వేరే దేశాలకు భయపడి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక చిన్న ఆశతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ముందు అడుగులు వేస్తున్నారు. తాలిబన్ల గురించి ఈ ప్రపంచానికి ఎక్కువగా తెలియకపోయినా వాళ్లు చేసే అరాచకాలు మాత్రం ఎంతో క్రూరంగా ఉంటాయి.

ఇక ఈ దేశంలో ఉండటం కంటే మరో దేశంకు వెళ్లడమే సరైనదని బయలుదేరుతున్నారు. అంతేకాకుండా అక్కడున్న విమానాశ్రయంలో తెగ ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంకు సంబంధించిన ఫోటోలను శాటిలైట్ ద్వారా ఫోటోలు దింపగా అవి వైరల్ గా మారాయి. విమానాశ్రయం మాత్రం బస్ స్టాప్ గా మారింది. ఇక విమానాన్ని ఎగబడుతూ మరి ఎక్కుతున్నారు ప్రజలు. ఈ శాటిలైట్ ఫోటోలు మక్సార్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజనులు మాత్రం వారి బాధలను చూసి తెగ బాధపడుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లో భయానక పరిస్థితులు!

ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. ప్రజలు దేశాన్ని వదిలి తరలిపోతున్నారు. దీంతో కాబుల్ ఎయిర్పోర్టులో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుండి తరలిపోతున్న ప్రయాణికులపై యూఎస్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు జర్మనీ ప్రభుత్వం ఆఫ్ఘన్ లోని తమ దేశ పౌరులు తరలించడానికి సైనికులను పంపిస్తుంది. భారత్ సైతం పౌరులను తరలించడానికి రెండు విమానాలను సిద్ధం చేసింది.

ఇక ఆఫ్ఘన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో పాఠశాలలు కార్యాలయాలు ఇప్పటివరకు తెరచుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో తాలిబాన్లు ఇళ్లలోకి చొరబడి లూటీలకు తెగబడుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ గా తాలిబన్ చీఫ్ అబ్దుల్ ఘనీ!

తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబాన్లు దురాక్రమణను కొనసాగించి కాబూల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు సైతం ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాలిబాన్ చీఫ్ అబ్దుల్ ఘనీ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

మరోవైపు ఆఫ్ఘన్ ప్రభుత్వ మంత్రులు, అధికారులు ఇతర దేశాలకు పారిపోయారు. సీఎం అశ్రఫ్ ఘనీ సైతం అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విడిచి వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులూ కలిగించమని తాలిబాన్లు స్పష్టం చేశారు. అమెరికా తన రాయబార కార్యాలయం తో పాటు సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలించింది.

ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ!

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇవాళ ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. అతి పెద్ద నగరమైన జలాలాబాద్ ను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు 19 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా దురాక్రమణను కొనసాగిస్తున్నారు.

taliban

తాలిబన్ల దురాక్రమణ పై ఐరాస జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతరించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తోంది.

కాబుల్​లోకి తాలిబన్లు- అఫ్గాన్​ పూర్తిగా వారి అధినంలోకి!

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక్కొ ప్రాంతాన్ని తమ అధినంలోకి తెచ్చుకుని దేశం మెుత్తాన్ని ఆక్రమిస్తున్నారు. ఒక్క కాబూల్‌ మినహా దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను తాలిబన్‌ దళాల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చాయి. నేడు మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరం వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్‌ ప్రావిన్స్‌ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు. సైన్యం నుంచి యుద్దం, ప్రతిఘటనలు లాంటివి ఏవి లేకపోవడంతో అఫ్ఘాన్ పూర్తిగా తాలిబన్‌ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. సైన్యం కూడా తమ ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి తాలిబన్లకు స్వచ్ఛందంగా లొంగిపోతోంది.