Tag Archives: china

టీవీ నటికి రూ. 340 కోట్ల జరిమానా.. అంత జరిమానా ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇది చదవండి..

ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి ఆదాయం అనేది వివిధ రకాల పన్నుల ద్వారానే వస్తుంది. వాటి ద్వారానే వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. అది ఆదాయపు పన్ను కావచ్చు.. కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు.. ఇంకా ఏదైనా ట్యాక్స్ కావచ్చు. ఆదాయానికి మించి ఎవరికైనా అదనపు ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి.

అయితే ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు పన్నులకు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తోంది. ఇలా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఓ సెలెబ్రెటీపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు రూ.340 కోట్లు కట్టాలని సమన్లు కూడా జారీ చేసింది. ఆ పన్ను కట్టే వరకు ఎలాంటి షోలకు, సినిమాలకు వెళ్లే హక్కు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆమె పేరు జెంగ్‌‌‌‌ షువాంగ్‌.

చైనాలో అతి పెద్ద సెలబ్రిటీ. ఈమె గత రెండు సంవత్సరాల్లో సినిమాలు, టీవీ సరీస్ ల కోసం తీసుకున్న పేమెంట్ కు సంబంధించి పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ సర్వీస్‌ గుర్తించింది. అంతకముందే ఆమెకు ఛాన్స్ ఇచ్చి చూశారు. అయినా ఆమె పన్ను కట్టకపోవడంతో పలు సినిమాల్లో నటించేందుకు నిషేధం విధించడంతో పాటు.. జరిమానా కూడా విధించారు.

చైనా ప్రభుత్వం పన్నులను వసూలు చేసే విషయంలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి రాజకీయ నాయకులు, సెటబ్రిటీలు ఎవరూ అతీతులు కాదంటూ పేర్కొంది. మన దేశంలో కూడా పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

చైనాలో డైనోసర్ల అవశేషాలు.. తవ్వకాలు జరుపుతుండగా బయట పడ్డ అస్థిపంజరం..

ప్రపంచంలో జనాభా అధికంగా గల దేశం చైనా. తర్వాత స్థానంలో మన భారతదేశం ఉంది. అయితే చైనాలో అక్కడి శాస్త్రవేత్తలు రెండు డైనోసార్ల నమూనాలను కనుగొన్నారు. ఇవి రెండు దాదాపు ఓ పెద్ద నీటి తిమింగలం అంత సైజులో ఉన్నాయని వారు తెలిపారు. 130 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. మొదటిది 65 అడుగుల పొడవు.. రెండోది 55 అడుగుల పొడవుతో ఉన్నాయని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

వీటిని వాయవ్య చైనాలోని కనుకొన్నట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. వీటి యొక్క పేర్లను శాస్త్రవేత్తలు సిలుటిటాన్ సినెన్సిస్ లేదా “సీలు’’, హమిటిటాన్ జిన్జియాంగెన్సిస్ లేదా హమీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. శిలాజాలు జిన్జియాంగ్‌లో కనుగొన్నారు. అందుకే అలా పేరు పెట్టారు. చైనాలో సీలు అంటే సిల్క్ రోడ్ అని అర్థం. హీమి అంటే కొనుకొన్న నగరాన్ని సూచిస్తుంది. ఇందులో ఒక డైనోసర్ మొక్కలను మాత్రమే తింటుందని తెలిపారు.

ఇవి ఆసియా, దక్షిణ అమెరికాలలో తిరిగేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఓ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓ ఇంట్లో డైనోసార్ల గుడ్లు దొరికాయి. అధికారులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి పరిశోధనలు చేశారు. అక్కడ దాదాపు 231 గుడ్లు ఒక డైనోసార్ అస్థిపంజరం దొరికింది. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్విస్తున్నాడు. తవ్వకాలు జరుపుతుండగా శిథిలావస్థలో ఉన్న 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది.

అయితే ఇంటి యజమాని వారికి ప్రభుత్వం అప్పగించకుండా దాచిపెట్టుకున్నారని అధికారులు చెప్పారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటిదే ఇప్పుడు మళ్లీ వాటి అవశేషాలు దొరికాయి. ఇలా డైనోసర్ల చరిత్రను అక్కడి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అక్కడ గాలిలో తేలొచ్చు.. అతిపెద్ద ఖగోళ మ్యూజియం.. ఎక్కడంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళశాస్త్ర మ్యూజియంను చైనాలోని షాంఘైలో ఇటీవల ప్రారంభించారు. ఈ మ్యూజియం దాదాపు 39 వేల చదరపు మీటర్లు ఉంది. అబ్జర్వేటరీ, ప్లానిటోరియం,78 అడుగుల పొడవైన టెలిస్కోప్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ఈ మూజియం యొక్క డిజైన్ ను అమెరికన్ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎనిడ్ తీయారు చేసింది.

ఇది అండాకార ఆకారంలో ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి మూలలు, రేఖలు ఉండవు. దీనిని ఆకాశం నుంచి చూస్తే ఆస్ట్రోలాబ్ లాగా కనిపిస్తుందని ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ థామస్ వాంగ్ తెలిపాడు. అయితే ఈ మూజియం యొక్క ప్రత్యేకతు ఏంటంటే.. ఖగోళశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎన్నో ఉల్కల నమూనాలు ఇక్కడ కనిపిస్తాయి.

అంగారక గ్రహానికి సంబంధించి ఎన్నో విశేషాలను తెలుసుకోవచ్చు. గుండ్రంగా ఉన్న ఈ మ్యూజియంలో పర్యాటకులు బరువులేని అనుభూతిని పొందుతారు. అంటే అంతరిక్షంలో ఎలాగైతే జీరో గ్రావిటీ ఉంటుందో ఇక్కడ కూడా బరువును కోల్పోయి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గాలిలో తేలుతున్న అనుభవం కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యూజియం సందర్శకుల కోసం తెరిచిన దగ్గర నుంచి విపరీతంగా సందర్శకులు తాకిడి ఎక్కువ అయింది.

ప్రపంచంలోనే ఎక్కువగా ఖగోళానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉండటంతో అతి పెద్ద మ్యూజియం ఇదే అని చెబుతున్నారు. ఆకాశంలో జరిగే వింతలకు సంబంధించి ప్రతీ విషయం ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. అలా వాటిని సెట్ చేశారు.

చైనాలో అతడు ఒకప్పుడు బిలియనీర్.. ఇప్పడు సాధారణ పౌరుడు.. ఎందుకిలా జరిగిందంటే..?

ప్రస్తుత కాలంలో ఎప్పుడు.. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలా జరుగుతుందని వాళ్లు ఊహించి ఉండరు కదా.. ఇలా ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటిదే ఒకటి చైనాలో జరిగింది. అదేంటంటే..

చైనా కు చెందిన లారీ చెన్ పాఠశాలలో రిటైర్డ్ టీచర్. అతడు ఆరు నెలల క్రితం అత్యంత ధనవంతులో ఒకరిగా నిలిచాడు. అయితే చైనా ప్రభుత్వం విద్యా రంగంపై విధించిన కఠిన నిబంధనల కారణంగా తన బిలియనీర్ హోదాను కోల్పోయాడు. ఇతడు గ్వోటు టెచెడు ఇంక్ వ్యవస్థాపకుడ, చైర్మన్ మరియు ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేస్తున్నాడు.

చైనా ప్రభుత్వం నిర్ణయాలకు తన ఆస్తి ఇప్పుడు 15 బిలియన్(రూ.11,15,27,85,00,000.00) డాలర్లు నుంచి రూ.2,498 కోట్లకు పడిపోయింది. అంతే కాకుండా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. తన ఆన్ లైన్-ట్యూటరింగ్ సంస్థ షేర్లు కూడా న్యూయార్క్ ట్రేడింగ్ లో దాదాపు మూడింట రెండు వంతులు పడిపోయాయి. అయినా అతడు ఏ మాత్రం భయపడలేదు.. నిరాశకు గురికాలేదు. ఏది ఏమైనా గావోటు నిబంధనలను పాటిస్తుంది, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుందని చెన్ చైనీస్ సోషల్ మీడియా వీబోలో తెలిపారు.

ఈ అనుభవం కేవలం చెన్ ఒక్కరికే జరగలేదు.. న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో తాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్ బాంగ్సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతే కాకుండా మరో బిలియనీర్ న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇంక్ ఛైర్మన్ యు మిన్హాంగ్ కూడా తన బిలియనీర్ హోదా ను కోల్పోయాడు. ఎడ్యుకేషన్ పై తీసుకున్న నిర్ణయాలతో పలు బిలియనీర్లు ఇప్పుడు తమ హోదాలను కోల్పోయారు.

చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. ఈ వైరస్ బారిన పడి ఒకరి మృతి!

వెటర్నరీ డాక్టర్ చనిపోయిన రెండు కోతులకు పోస్టుమార్టం నిర్వహించిన కొన్నిరోజులకు అతడు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా పశు వైద్యుడు మృతిచెందడంతో అతని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఎవరికీ ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు.

మంకీ బీ వైరస్‌ను మొట్టమొదటిసారిగా 1932లో కనుగొన్నారని, ఈ వైరస్ కనిపెట్టిన నాటి ఇప్పటివరకు కేవలం యాభై మరణాలు మాత్రమే సంభవించడం విశేషం. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందుతారు. ఈ వైరస్ ను మొట్ట మొదటిసారిగా మకాక్యూ అనే జాతికి చెందిన కోతులలో గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

మరొక విషయం ఏమిటంటే ఈ వైరస్ మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందక పోవడం ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వైరస్ ఎక్కువగా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బందికి మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.ఈ వైరస్ బారిన పడితే ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, కేవలం యాంటీవైరల్ మెడిసిన్స్‌తోనే ఈ వైరస్‌కి చికిత్స అందిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.

ఫేక్ ఫోటోలతో ప్రమోషన్ … ఆ దేశ పరువును తీసిన చైనా యువత?

సాధారణంగా వివిధ దేశాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూడటం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించడం కోసం పర్యాటక శాఖ పర్యాటక ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్జియాపు కౌంటీ అనే సుందరమైన ఒక చిన్న గ్రామం ఎంతో మంది పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే అందాలు ఆ వూరి సొంతమని చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించింది.

ప్రమోషన్ లో భాగంగానే బీచ్ ఒడ్డున ఎంతో సుందరంగా కనిపించే అందాల నడుమ జాలర్లు చేపలు పట్టడం. పచ్చదనం పొగ మంచులలో పక్షుల సందడి,వెరసి చైనాలోని రూరల్‌ టౌన్‌ గ్జియాపు కౌంటీని సుందర ప్రాంతంగా ప్రకటించుకుంది చైనా పర్యాటక శాఖ. అయితే వీటిని చూసిన ఇతర విదేశీ పర్యాటకులు ఆ ప్రదేశాలకు పెద్దఎత్తున అక్కడి ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారు. కానీ ఆ ప్రదేశంలో అలాంటి సుందరమైన అందాలు కనిపించక పోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు.

ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రచారం అంతా పైన పటారం లోన లొటారం అంటూ అసలు ఫోటో షూట్లను బయటపెట్టి చైనా ప్రభుత్వం బండారాన్ని చైనా దేశానికి చెందిన కొందరు యువత బయటపెట్టారు.అంతేకాకుండా ఆ ఫోటోలో ఉన్నది నిజం కూలీలు రైతులు కాదని ,వాళ్ళందరూ కూడా మోడల్స్ అని వారి కోసం చాలా డబ్బులు వెచ్చించారని అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం స్పందించి కరోనా కారణం వల్ల ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆ గ్రామానికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం కూడా ప్రచురించింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన గ్రామాన్ని ఆర్థికంగా నిలబెట్టడం ఒక మంచి పని అయినప్పటికీ ఈ విధంగా మోసపూరితంగా వచ్చిన ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం దేశానికి పరువు తీసే అంశమని భావించిన యువత అసలు విషయాన్ని బయటపెట్టారు.

కరోనా మూలాలు తేల్చాలి ఇంటిలిజెన్స్ కు జో బైడేన్ ఆదేశం.. చైనా అభ్యంతరం..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. చైనాలో మొదలైన ఈ వైరస్ జంతువులనుంచి వచ్చిందా ? లేక ల్యాబ్ నుంచి వచ్చిందా అనే విషయంపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని అమెరికా ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సూచించారు జో బైడెన్. ఈ విషయంపై అనేక కధనాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మరోసారి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు అమెరికా నేషనల్ ల్యాబోరేటరీస్ కు విజ్ఞప్తి చేసారు. ఇందులో భాగంగా ఈ కరోనా మూలాలు కనుక్కునేందుకు చైనా కలిసిరావాలని కోరారు.

కొవిడ్ -19 మూలాలపై దర్యాప్తును చైనా ఇప్పటికీ అడ్డుకుంటుందని ఆరోపించారు. అంతర్జాతీయ పరిశోధనలకు చైనా ప్రభుత్వ సహకారం లేనందున అసలు నిజాలు ఎప్పటికీ తెలియకపోవచ్చని అన్నారు. అయితే దర్యాప్తు సంస్థలు సమాచార ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, విశ్లేషణాత్మక వివరాలను సేకరించాలని సూచించారు. ఈ క్రమంలో ఖచ్చితమైన నిర్ధారణతో తమకు 90 రోజుల్లోనివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్‌ను బైడెన్‌ ఆదేశించారు.

కరోనా మూలాలు కనుగొనాలని జో బైడేన్ అమెరికా ఇంటెలిజెన్స్‌ ను ఆదేశించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది చైనా. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఇలాంటి దర్యాప్తు జరుపుతున్నారని. ఇటువంటి చర్యలు దర్యాప్తుకు ఆటంకం కలగడంతో పాటూ కరోనా కట్టడిలో అవరోధాలను సృష్టిస్తాయని తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబారి ఒక ప్రకటన విడుదల చేసారు. అయితే రెండో దశ దర్యాప్తుకు WHO సిద్దమవుతున్న నేపధ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు ఈ జో బైడేన్ చేసిన ఆదేశాలు మింగుడుపడటం లేదు.

చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయ్యింది.. ఇదే సాక్ష్యం!

గత సంవత్సరన్నర కాలం పాటు ప్రపంచ దేశాలన్నింటికీ వణికిస్తున్న కరోనా మహమ్మారి మొట్టమొదటిసారిగా చైనాలోని ఊహాన్ ప్రాంతంలో నమోదు కాగా ప్రపంచ దేశాలన్నీ చైనా దేశం పై తప్పుబట్టాయి. కావాలనే చైనా ప్రభుత్వం జీవ ఆయుధాన్ని తయారుచేసే ప్రపంచంపై వదిలిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పటికీ సార్స్‌కోవ్‌-2 ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపించింది అనే విషయాల గురించి పరిశోధకులు నిరంతరం అన్వేషణ కొనసాగిస్తున్న ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు.

తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి ఓ సమాచారాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దీనికి సంబంధించి ఓ కథనం ప్రచురించింది. వైరస్‌ విషయం బయటికి రావడానికి ముందే చైనాలోని ఊహన్ ల్యాబ్ లో ముగ్గురు పరిశోధకులు మృత్యువాత పడ్డారని ఈ పత్రిక వెల్లడించింది. అమెరికా ఇంటిలిజెన్స్ నిపుణుల ఆధారంగా కరోనా విషయంలో మరోసారి చైనా పాత్ర బయటపడింది.

ప్రపంచానికి తీవ్ర గందరగోళానికి గురి చేసిన సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ వ్యాపించడానికి ముందే వుహాన్‌ ల్యాబ్‌లో కొంతమంది పరిశోధకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించింది. వీరిలో సాధారణ ఫ్లూ కనిపించే జ్వరం, పొడిదగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని, కరోనా బారిన పడిన వారిలో కూడా ఇదే లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. అయితే వారు ఏవిధంగా మృత్యువాత పడ్డారని విషయం గురించి సరైన ఆధారాలు లేవు.

మొట్టమొదటిసారిగా చైనాలోని తొలి కరోనా వైరస్ కేసు డిసెంబర్‌ 8,2019న నమోదైంది. కానీ అప్పటికే చైనాలో ఎంతోమంది ఈ వైరస్ బారిన పడినట్లుగా అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం పై ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం బయటకు ఇవ్వకపోవడంతో చైనా పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

లీకైన చైనా రహస్య పత్రం ..కరోనా గురించి ఏం చెబుతోంది?

గత ఏడాది నుంచి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో పుట్టింది. అయితే ఈ వైరస్ వూహాన్‌లో ల్యాబ్ నుంచి పరిశోధనలో నిర్వహిస్తుండగా లీకైనదా? లేక దానికదే వ్యాప్తి చెందిందా? లేకపోతే జన్య మార్పిడి చేసి జీవాయుధగా ఎవరైనా వదిలారా? అనే సందేహాలు అన్ని దేశాలు వ్యక్తం చేశాయి. అయితే చైనా పైనే ఉన్న నేపథ్యంలో ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చడానికి చైనా మిలిటరీ అధికారులకు సంబంధించిన రహస్య పత్రం లీక్ అయింది. ఇంతకీ ఆ రహస్య పత్రం కరోనా గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం….

కోవిడ్‌–19 ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై పరిశోధన చేస్తున్న అమెరికన్‌ అధికారులకు చైనాకు చెందిన ఓ రహస్య పత్రం దొరికింది. ఆ పత్రంలో ‘‘మనుషులు సృష్టించిన సార్స్, ఇతర కొత్త వైరస్‌లను జన్యు మార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించడం అనే కథనంతో చైనా మిలిటరీ అధికారులు, సైంటిస్టులు రాసిన రహస్య పత్రం అది.

చైనా అధికారులు ఈ రహస్య పత్రాన్ని గత ఐదు సంవత్సరాల క్రితం అనగా 2015 వ సంవత్సరంలోనే ఈ పత్రం రాయడం గమనార్హం. సరికొత్త జెనిటిక్ ఆయుధాల శకంలో సార్స్, కరోనా వైరస్ లో ఒక భాగం.వీటిలో జన్యు మార్పిడి చేసి వీటిని ఒక జీవ ఆయుధాలుగా విడుదల చేయవచ్చు. ఈ ప్రపంచంలో మూడవ యుద్ధం అంటూ వస్తే అది కేవలం జీవాయుదాలతోనే వస్తుందని ఈ రహస్య పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ విధంగా జీవాయిదాలను ప్రయోగించడం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ చైనా ఆర్మీ అధికారులు అంచనా వేశారు. ఉగ్రవాదులు ఈ వైరస్ మన ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించి ఉంటారని అంచనా వేశారు. అయితే ఇది చైనా వూహన్ ప్రయోగశాల నుంచి పొరపాటున లిక్ అయిందా, లేక ఉద్దేశపూర్వకంగానే చేశారా అనే దానికి సరైన ఆధారాలు లేవు.

కొన్ని సంవత్సరాల నుంచి చైనా వూహన్ లాబ్లో ప్రమాదకరమైన కొత్త వైరస్‌లను సృష్టించి, పరిశోధనలు చేస్తోందని సమాచారం వినబడుతుంది.రహస్య పత్రంలో చైనాకు సంబంధించిన 18 మంది సైంటిస్టులు మిలిటరీ ఉన్నత అధికారుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ రహస్య పత్రం పై స్పందించిన చైనా ప్రభుత్వం కరోనా మూలాలపై చైనాను ఇరుకున పెట్టడం కోసమే ఇలాంటివి చిత్రీకరించారని పేర్కొంది.

ఐస్ క్రీమ్ లు తినేవారికి షాకింగ్ న్యూస్.. ఐస్‌క్రీమ్‌లో కరోనావైరస్..!

కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా కరోనా విషయంలో నిర్లక్ష్యంలో వహిస్తే ప్రమాదమని జరుగుతున్న ఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి పుట్టుకకు కారణమైన చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. చైనా దేశంలోని ఐస్ క్రీమ్ లలో కరోనా వైరస్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏకంగా 4,800 ఐస్ క్రీమ్ బాక్సుల శాంపిల్స్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించడం గమనార్హం. కరోనా నిర్ధారణ అయిన ఐస్ క్రీమ్ బాక్సులన్నీ ఒకే కంపెనీకి చెందినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఐస్ క్రీమ్ బాక్సుల్లో కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ఆ ఐస్ క్రీమ్ ను తిన్నవారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించే పనిలో పడ్డారు. 4,836 ఐస్ క్రీం బాక్సులలో 935 ఐస్ క్రీం బాక్సులు స్థానిక మార్కెట్ లోకి ఇప్పటికి వెళ్లిపోయాయని తెలుస్తోంది. అయితే వాటిలో కేవలం 65 బాక్సులను మాత్రమే విక్రయించారు. ఈ 65 బాక్సులలోని ఐస్ క్రీమ్ లను తిన్నవాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది.

టియాజిన్ మున్సిపాలిటీ ప్రాంతంలోని ఐస్ క్రీమ్ ను ల్యాబ్ కు పంపగా ఐస్ క్రీం కరోనా వైరస్ తో కలుషితమైందని శాస్త్రవేత్తలు గుర్తించడం గమనార్హం. ఐస్ క్రీమ్ లలో కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ఆ ఐస్ క్రీమ్ లను తిన్నవారిని నిర్ధారించే పనిలో పడ్డారు. ఐస్ క్రీమ్ తయారీలో న్యూజిలాండ్ వెన్న, ప్రోటీన్, ఉక్రేయిన్ మిల్క్ పౌడర్ ను వాడారని సమాచారం. కలుషితమైన ఐస్ బాక్సులను ఇప్పటికే వేరు చేశారు.

ఐస్ క్రీమ్ బాక్సులలో కరోనా వెలుగులోకి రావడంతో ఐస్ క్రీమ్ లు తినేవాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోల్డ్ టెంపరేచర్ దగ్గర కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఐస్ క్రీమ్ కంపెనీలో పని చేసే ఉద్యోగులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.