Tag Archives: corona

Vijaykantha: ఇండస్ట్రీలో విషాదం కరోనాతో నటుడు విజయ్ కాంత్ మృతి?

Vijaykantha: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా డిఎండికే నాయకుడిగా రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ కాంత్ కొద్ది క్షణాల క్రితం కన్నుమూశారు. ఈయన ప్రముఖ నటుడిగా రాజకీయ నాయకుడిగా తనదైన శైలిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

అయితే గత కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయనను చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసే చికిత్స అందించారు. గతంలో ఈయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు అంటూ కూడా వార్తలను వైరల్ చేశారు కానీ ఆయన క్షేమంగానే ఉన్నారంటూ తన భార్య అతనితో కలిసి దిగిన ఫోటోలను విడుదల చేశారు.

అనారోగ్య సమస్యల నుంచి కాస్త కోలుకున్నటువంటి విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో ఈయనని చెన్నైలోనే మియాట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈయన పరిస్థితి మరింత విషమం కావడంతో వైద్యులు ఈయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చింది. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం చేత ఈయన శ్వాస తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు.

కరోనా పాజిటివ్…

శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వైద్యులు ఈయనని వెంటిలేటర్ పైకి తరలించి చికిత్స అందించారు. అయితే తన పరిస్థితి తీవ్రతరం కావడంతో కొన్ని క్షణాల క్రితం మరణించారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Posani Krishna Murali: మూడోసారి కరోనా బారిన పడిన పోసాని ఆస్పత్రికి తరలింపు!

Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. ఇదివరకే ఈయన రెండుసార్లు కరోనా బారిన పడగా తాజాగా ఈయన మూడో సారి కరోనా బారిన పడ్డారు.ఈయనకు కరోనా అని తెలియడంతో కుటుంబ సభ్యులు తనని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

ఓ సినిమా షూటింగ్లో భాగంగా పూణే వెళ్లినటువంటి పోసాని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ఆయనకు ఒంట్లో బాగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోక పాజిటివ్ అని తెలియడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన మూడోసారి కరోనా బారిన పడటం గమనార్హం.


Posani Krishna Murali: ఆందోళనలో అభిమానులు


ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీల సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇలా పోసాని కరోనా బారిన పడ్డారని తెలియగానే పలువురు ఈయన క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Corona Variant: ఒమిక్రాన్ తరువాత వేరియంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డబ్ల్యూహెచ్‌వో!

Corona Variant: గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ ల రూపంలో ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డెల్టా వేరియంట్ తర్వాత ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కూడా ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురి చేస్తున్నాయి.

అయితే చాలామంది ఈ ఒమిక్రాన్ వేరియంట్ చివరి వేరియంట్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే ఇదే ఆఖరి వేరియంటా? ఈ విషయం పై నిపుణులు ఏవిధంగా స్పందిస్తున్నారు.. అనే విషయానికి వస్తే..

ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నిల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవే తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ చివరి వేరియంట్ కాదని ఆమె తెలియజేశారు.

తర్వాత వేరియంట్ ఎంతో శక్తివంతమైనది…

ప్రస్తుతం మనం మాట్లాడుకునే ఒమిక్రాన్ వేరియంట్ తరువాత వచ్చే వేరియంట్ చాలా శక్తివంతమైనదని, ఈ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వేరియంట్ మన శరీరంలోకి వ్యాప్తిచెంది రోగనిరోధకశక్తికి దొరకకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కెర్ఖోవే వెల్లడించారు.

Breaking: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా..! తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన..!

Breaking: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి.. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను ఎవరినీ వదిలి పెట్టడం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా మహమ్మారి సోకడం కాస్త కలవరపెడుతోంది.

Breaking: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా..! తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన..!

అయితే కరోనా దాటి నుంచి తప్పించుకోవాలంటే.. మరో బూస్టర్ డోస్ వేసుకోవాలంటూ వైద్య అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కరోనా బారిన పడుతున్నారు.

Breaking: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా..! తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన..!

అందులో నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.


పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు..

తాను కోవిడ్ బారినపడినట్టు బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసిన వారంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని.. దాంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరాడు. ఇక గత కొన్నాళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ప్రజలతో మమేకమయి.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల అతడు కుప్పంలో పర్యటించాడు. అంతే కాదు.. ఇటీవల వైసీపీ కార్యకర్తల చేతిలో కారండచెడులో అత్యంత దారుణంగా హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంతిమ యాత్రలో కూడా పాల్గొన్నాడు. ఇలా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో అతడికి కారోనా సోకినట్లు తెలుస్తోంది.

Siri Hanmanth: కరోనా బారిన పడిన సిరి హన్మంత్..! హోం ఐసోలేషన్లో చికిత్స..!

Siri Hanmanth: బిగ్ బాస్ బ్యూటీ సిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్ గా సిరి నిలిచింది. ఇదే కాకుండా షణ్ముఖ్ జశ్వంత్ తో కెమిస్ట్రీలో మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌజ్ లో షన్నూతో కిస్సింగ్, హగ్గింగ్ లతో తెగ ఫేమస్ అయిపోయింది.

Siri Hanmanth: కరోనా బారిన పడిన సిరి హన్మంత్..! హోం ఐసోలేషన్లో చికిత్స..!

ఫ్రెండ్షిప్ కన్నా వీరిద్దరి మధ్య మరేదో రిలేషన్ ఉందని అనుకునేలా.. వీరిద్దరు చెలరేగిపోయారు. విజేతగా నిలవాల్సిన షన్నూ.. సిరి కారణంగా రన్నరప్ గా నిలిచారనే వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే షన్నూ- దీప్తి సునయన విడిపోవడానికి మెయిన్ విలన్ సిరినే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోలింగ్ లు నడిచాయి.

Siri Hanmanth: కరోనా బారిన పడిన సిరి హన్మంత్..! హోం ఐసోలేషన్లో చికిత్స..!

అయితే వీరిద్దరూ కూడా తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. వీరిద్దరి మధ్య బిగ్ బాస్ హౌజ్ లో నడిచిన ట్రాక్ ను బట్టి చూస్తే.. అలా అనిపించడం లేదు. ఇటు షన్నూ, దీప్తితో రిలేషన్ షిప్ లో ఉండగా… అటు సిరి కూడా శ్రీహాన్ తో రిలేషన్ షిప్ లో ఉంది.


పాజిటివ్‌గా తేలిందని ఇన్‌స్టా స్టోరీలో…

బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన సీన్లతో  ఈరెండు జంటల మధ్య తేడాలు వచ్చాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతుకు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈవిషయాన్ని ఇన్ స్టా ద్వారా తెలియజేసింది ఈ అమ్మడు. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

Mahesh Babu: కరోనాతో బాధపడుతున్నా.. నెల చిన్నారికి ప్రాణదానం చేసిన మహేష్ బాబు..!

Mahesh Babu: సాధారణంగా సినిమాలలో హీరోల పాత్రలు ఎంతో ఉదార స్వభావంగా ఉంటాయి. సినిమాలలో వీరి పాత్రలు కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతూ వారికి సహాయం చేసే విధంగా వీరి పాత్రలను సృష్టిస్తారు. అయితే సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మంది రియల్ హీరోలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.

Mahesh Babu: కరోనాతో బాధపడుతున్నా.. నెల చిన్నారికి ప్రాణదానం చేసిన మహేష్ బాబు..!

మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ఎన్నో రకాల బిజినెస్ ల ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈయన సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు ఒక చిన్నారి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది.

Mahesh Babu: కరోనాతో బాధపడుతున్నా.. నెల చిన్నారికి ప్రాణదానం చేసిన మహేష్ బాబు..!

వారికి ప్రత్యేక ధన్యవాదాలు..

జాంబవంతుల శిరీష అనే మహిళ నెలరోజుల క్రితం ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు గుండె సమస్య ఉండడంతో ఆ బిడ్డకు సర్జరీ చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది ఈ క్రమంలోనే ఈ విషయం మహేష్ బాబుకి తెలియజేయడంతో ఈ హీరో ఆ బిడ్డపట్ల చొరవ తీసుకుని ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యంతో సంప్రదించి ఆ బిడ్డకు పూర్తి చికిత్సను అందించారు.ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉండడంతో తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటివరకు మహేష్ బాబు 1050 మంది పిల్లల ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నమ్రత ఆంధ్ర హాస్పిటల్ వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహేష్ బాబు ప్రస్తుతం కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే.తన కరోనా బారిన పడినప్పటికీ ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టడం తో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

PM-CMs: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం కలిగిస్తోంది. అమెరికా, యూకే దేశాల్లో లక్షల్లో కేసులు వస్తున్నాయి. మరో వైపు ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 వేలకు తక్కువగానే ఉండేది.

PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

కానీ ప్రస్తుతం కేసులు సంఖ్య వేల సంఖ్య నుంచి లక్షలకు చేరాయి. తాజాగా ఈరోజు 2.45 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ఓమిక్రాన్ కేసులు కూడా పక్కలో బల్లెంలాగా పెరుగుతున్నాయి. 

PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు.


ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..

చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 15-18 ఏళ్ల లోపు ఉన్న టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్రికాషనరీ డోసులను కూడా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.  ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నేడు భేటీ కానున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు. దీంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరవచ్చు. మరోవైపు వ్యాక్సిన్ కార్యక్రమాలను వేగం చేయాలని సీఎంలకు సూచించే అవకాశం ఉంది. ప్రస్తుతం పండగలు వస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరించాల్సి విధానాల గురించి ప్రధాని.. సీఎంలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఆక్సిజన్ సదుపాయాలు, బెడ్లను సిద్దం చేసుకోవాలని సూచించే అవకాశం ఉంది.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స..!

Lata Mangeshkar: భారత్ లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం 10 వేల లోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దీనితో పాటే.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీ రాష్ట్రం అప్రపమత్తమయ్యాయి.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

దీనిలో భాగంగానే నైట్ కర్ప్యూ, లాక్ డౌన్ లు లాంటివి పెడుతున్నారు. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్, మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిషకు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది కోలుకున్నారు. మరికొంత మంది ఇంట్లోనే హోం క్వారంటైనల్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

ఇలా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమెకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.


Lata Mangeshkar : ఆందోళనలో అభిమానులు..

ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇక ఆమె రెండు సంవత్సరాల క్రితం వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె అక్కడ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆమె వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్స్ ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ లు ధరించాలని.. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ.. అనవసరంగా బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Renudesai: రేను దేశాయ్, అకీరా లకు కరోనా.. రెండు డోసులు తీసుకున్నా వచ్చింది రేణు దేశాయ్

Renudesai: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ ఎక్కువ అవుతున్నాయి. కొన్ని రోజుల వరకు రోజుకు కేవలం 10 వేలలోపే ఉన్న కేసులు ప్రస్తుతం లక్షను దాటాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి.  ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాన్ మాజీ భార్య సినీ స్టార్ రేణు దేశాయ్, కొడుకు అఖిరానందన్ కు కరోనా వచ్చింది.

Renudesai: రెండు డోసులు తీసుకున్నా కరోనా వచ్చింది..రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ విషయాన్ని రేణూ దేశాయ్ ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే తాను రెండు డోసులు తీసుకున్నా.. అని, త్వరలోనే అఖిరాకు కూడా వ్యాక్సిన్ అందిచాలని అనుకుంటున్న సమయంలో ఇద్దరికి కరోనా సోకిందని వెల్లడించింది. .


RenuDesai : వరసగా ఫిలిమ్ స్టార్లు కరోనా…

తమకు లక్షణాలు తగ్గిపోయాయని.. ప్రజలు కూడా థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోవాలని.. మాస్కులు తప్పకుండా పాటించాలని రేణూ దేశాయ్ సూచించింది. ఇదిలా ఉంటే ఇటీవల వరసగా ఫిలిమ్ స్టార్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లోని ప్రముఖులు కరోనా బారిన పడ్దారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిష, సింగర్ లతా మంగేష్కర్ వంటి వారికి కరోనా సోకింది. మరోవైపు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి కరోనా సోకింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Tollywood: సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడటం వెనుక దాగి ఉన్న కారణం ఇదేనా?

Tollywood: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాపుతోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో మరో సారి ప్రతి ఒక్కరు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా మొదటి రెండవ దశలో ఎంతోమంది సిని సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు.

Tollywood: సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడటం వెనుక దాగి ఉన్న కారణం ఇదేనా?

అయితే ఈ రెండు దశల్లో కాకుండా ప్రస్తుతం సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీ వుడ్ పరిశ్రమలలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇలా వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడటంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tollywood: సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడటం వెనుక దాగి ఉన్న కారణం ఇదేనా?

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడినట్లుగా తెలిపారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారికి గురైనట్లు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరందరూ ఒక్కసారిగా మహమ్మారి బారిన పడటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

నూతన సంవత్సర వేడుకలే కారణమా….

కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం పలువురు సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నూతన సంవత్సరం తర్వాత పలువురు కోవిడ్ బారిన పడగా, మరికొందరు మాత్రం నూతన సంవత్సర వేడుకల కోసం ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త హైదరాబాద్ నగర శివారులో నిర్వహించిన పార్టీలో పాల్గొన్నారని, ఈ పార్టీలో ఏ విధమైనటువంటి కరోనా నిబంధనలను పాటించకపోవడంతో వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందనే వార్తలు వినబడుతున్నాయి. మొత్తానికి నూతన సంవత్సర వేడుకలే వీరికి ఈ పరిస్థితి తీసుకు వచ్చాయా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.