Tag Archives: farmers

Pallavi Prashanth: రైతులకు డబ్బు ఇవ్వడానికి నేనేమైనా సీఎంనా…గెలిచాక మాట మార్చిన రైతు బిడ్డ?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే టాగ్ వేసుకుని ఈయన ఎన్నో వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాలను సోషల్ మీడియా వేదికగా వీడియోల రూపంలో తెలియజేస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయనకు వచ్చినటువంటి గుర్తింపు కారణంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా తన ఆట తీరుతో ఆకట్టుకున్నారు అలాగే కొన్నిసార్లు సింపతి డ్రామాలు కూడా ప్లే చేసి ఓట్లు సంపాదించారు.

అచ్చం రాజకీయ నాయకుల తరహాలోనే ఈయన కూడా ఓట్లు కోసం భారీగా హామీలు కూడా ఇచ్చారు. తాను డబ్బు గెలిస్తే కచ్చితంగా ఆ డబ్బును రైతు కుటుంబాలకు ఇస్తానని ఆపదలో ఉన్నటువంటి రైతులకు అండగా నిలుస్తానని చెప్పారు. ఇలా కప్పు గెలవడానికి ముందు ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కప్పు గెలిచిన తర్వాత మాట మార్చి మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు.

కప్పు గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మీరు మీ చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఇదివరకు ఏదైనా సహాయం చేశారా అంటూ ప్రశ్నలు వేయగా వెంటనే ఈయన నేనేమైనా సీఎం అనుకుంటున్నారా అందరికీ సహాయం చేయడానికి అంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వ్యాఖ్యలపై చాలామంది భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

అసలు రంగు బయటపెట్టిన పల్లవి ప్రశాంత్..

కప్పు గెలిచే వరకు రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించినటువంటి ఈయన గెలిచిన తర్వాత రైతులకు సహాయం చేయడానికి వెనకాడుతున్నారని మాట మారుస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. గెలిస్తే రైతులకు డబ్బు ఇస్తానని ఆశ చూపి ఓట్లు పడేలా చేసినటువంటి ప్రశాంత్ గెలిచిన తర్వాత మాట మార్చడంతో ఈయన అసలు రంగు బయటపడింది అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Fake Fertilizers: వేల రూపాయలు పోసి ఎరువుల బస్తాలు కొన్న రైతు… వాటి తెరిచి చూసి లబోదిబోమన్నాడు!

Fake Fertilizers: భారత దేశంలో వ్యవసాయం అంటేనే రుతుపవనాలతో జూదం. ఏ ఏడాది పంట చేతికి వస్తే మరో ఏడాది తీవ్ర వర్షాల వల్లనో, కరువు వల్లనో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయినా ఏ నాడు వ్యవసాయాన్ని వదలడం లేదు రైతన్నలు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా ఎరువులకు, కౌలుకు, కూలీలకు రేట్లు పెరుగుతున్నాయి.

Fake Fertilizers: వేల రూపాయలు పోసి ఎరువుల బస్తాలు కొన్న రైతు… వాటి తెరిచి చూసి లబోదిబోమన్నాడు!

మొత్తంగా పెట్టుబడీ పెరుగుతున్నా.. అందుకు తగిన గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా రాని పరిస్థితి ఉంది.  ఇదిలా ఉంటే మరోవైపు కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారుల మాటలు నమ్మి నట్టేటా మునిగిపోతున్నారు.

Fake Fertilizers: వేల రూపాయలు పోసి ఎరువుల బస్తాలు కొన్న రైతు… వాటి తెరిచి చూసి లబోదిబోమన్నాడు!

ముఖ్యంగా సీజన్ ప్రారంభం అయిందంటే నకిలీ విత్తనాలు.. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తానాలు నకిలీవి అమ్ముతున్నారు. పంట వేసిన కొంత కాలానికి కాపు, పూత రాక నష్టపోతున్నారు. పురుగుల మందు తాగుతూ.. ఉరి వేసుకుంటు రైతులు తనువు చాలిస్తున్నారు.


గోదాంలతో స్టాక్ పెట్టి పలు గ్రామాల్లో..

సరిగ్గా ఇలాంటి కల్తీ వ్యవహారమే రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో తిరుగుతూ రైతులకు నకిలీ ఎరువులు అంటగట్టారు. తడమడ్ల గ్రామంలో రైతు స్వామికి ఇలాంటి నకిలీ ఎరువులను అంటగట్టారు. బస్తాకు రూ. 1000 నుంచి రూ. 2000 లకు ఎరువులను అంటగట్టి… ఎక్కువ దిగుబడి వస్తుందంటూ.. మాయమాటలు చెప్పారు. దోమకొండ మండలం కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని గోదాంలతో స్టాక్ పెట్టి పలు గ్రామాల్లో విక్రయించారు. అయితే పంటలో వేస్తే ఎటువంటి మార్పు రాలేదని.. కేవలం మట్టి మాత్రమే బస్తాల్లో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తాము మోసపోయామని.. ఇప్పటికైనా అధికారులు కల్తీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

Trending News: ఎవరి ఖాతాలోనైనా రూ.15లక్షలు వచ్చి పడితే ఏం చేస్తాం. ఎక్కడి లేని సంతోషపడుతాం. ఆ తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చాయోనని ఆరా తీస్తాం. అవి పొరపాటున ఖాతాలో జమయ్యాయని తెలిస్తే షాక్ కు గురవుతాం. సరిగ్గా ఓ రైతుకు ఇలాగే జరిగింది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

వచ్చిన డబ్బులో రూ.9లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. తీరా ఆ నగదు తనకు రావాల్సింది కాదని తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. ఆ ఖర్చు చేసిన మొత్తం కట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఎలా అని తలపట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్ జిల్లా దావర్వాడీ గ్రామంలో చోటుచేసుకుంది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

దావర్వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. చిన్నా చితకా పనులు చేస్తూ జీవించేవాడు. కొంతకాలం క్రితం అతను తన జన్ ధన్ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోగా రూ.15లక్షలు జమ అయి ఉన్నాయి.


దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ..

2014 ఎన్నికల సమయంలో భాజపా అధికారంలోకి వస్తే వస్తే విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం తిరిగి వెనక్కి తెస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేయొచ్చని చెప్పారు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న ధ్యానేశ్వర్ తన ఖాతాలో మోదీనే నగదు జమ చేసి ఉంటుందని సంబరపడ్డాడు. దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ఓ చిన్న ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు. ఆ ఆనందంలోనే అతనికి అందిన ఓ లేఖ పిడుగులాంటి వార్తను తెచ్చింది. ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాలో జమయ్యాయి. వాటిని మీరు తిరిగి చెల్లించాలి’ ఇది ఆ లేఖలోని సారాంశం. ఇది చదివి ఆ రైతు కంగుతిన్నాడు. ఖాతాలో మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించినా.. ఖర్చు చేసిన డబ్బును ఎలా చెల్లించాలా ఆ రైతు తలపట్టుకున్నాడు.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

CM KCR-Farmers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ముందుకు సాగుతోంది. రైతుబీమాతో ఒకవేళ రైతు మరణిస్తే అతడి కుటుంబసభ్యుల్లోని నామినీకి రూ.5లక్షలు ఇవ్వనున్నారు. దీనికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దానికి సంబంధించిన ప్రీమియాన్ని చెల్లిస్తుంది.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

ఇక రైతు బంధు విషయానికి వస్తే భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద సాయం చేస్తోంది.
ఎకరం పొలం ఉన్న రైతులకు రెండు దఫాలకు ఐదు వేల చొప్పున రూ.10 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా మరో శుభవార్తను అందించింది కేసీఆర్ ప్రభుత్వం.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

రైతులకు పింఛన్‌‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌‌లో ఈ స్కీమ్ ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌ మొదలు పెట్టింది. దీనికి సంబంధించి పథకాన్ని సీఎం కేసీఆర్ కొండపోచమ్మసాగర్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు గుడ్‌‌ న్యూస్‌‌ చెప్తానని వెల్లడించారు.

పలు కారణాలతో ఆ హామీ అలాగే మిగిలిపోయిందని.. రైతుబంధు, రైతుబీమాలకు తోడుగా అన్నదాతల కోసం ఈ స్కీం తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు పలు సందర్భాల్లో వెల్లడించాయి.
రైతులకు నెలకు రూ.2016 ఫిచన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు పింఛన్‌‌ విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిమగ్నమైంది.


చిన్న, సన్న కారు రైతులకు..

చిన్న, సన్న కారు రైతులకు రూ.2016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని.. రైతుకు 47 ఏల్లు నిండాలని పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్ ఇప్తున్న ప్రభుత్వం.. ఆ కార్మికుల కంటే వయోపరిమితి రెండేళ్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 47 ఏళ్లు వయస్సు పరిమితి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట ఎందుకంటే.. రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారు..? 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఫైనల్ గా 47 ఏళ్లు నిండి ప్రతీ రైతుకు పింఛన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మూడెకరాల నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం.. బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

ఆగ్రహించిన ఉల్లి రైతు.. మార్కెట్ కు తీసుకొచ్చిన పంట విషయంలో..!

మొన్నటి వరకు ఉల్లి ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో ఎక్కువగా రైతులు లాభపడ్డారు. ప్రస్తుతం అదే ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను పండించిన పంటకు నిప్పు పెట్టాడు.

ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంచలింగాల గ్రామానికి చెందిన ఉల్లి రైతు వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లాడు. మొన్నటి వరకు మంచి డిమాండ్ ఉన్న ఉల్లికి ప్రస్తుతం కూడా అదే డిమాండ్ ఉంటుందని అనుకున్నాడు.

కానీ అతడు కర్నూలు మార్కెట్‌కు తన ఉల్లిని తీసుకొచ్చిన తర్వాత షాక్ అయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతిలో క్వింటా రూ.350 ధర పలకడంతో దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతి ద్వారా కొంతమంది రైతులకు మాత్రమే మంచి ధరలు వస్తున్నాయని.. మిగతా వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా.. ఆగ్రహించిన రైతు ఉల్లి బస్తాలపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ఇక దీనిపై అధికారులు స్పందించారు. క్వింటాల్ కు రూ.600 నుంచి రూ.700 మధ్య ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇటువంటివి మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు జమ అయ్యేందుకు కేవలం ఐదు రోజులే..

వివిధ దశల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్‌ నుంచి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన నగదును ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో జమ కానుంది. అంటే ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలిఉంది.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జూన్‌‌‌‌‌‌‌‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం కింద రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కూడా పెరగనుంది.

ఏమైనా సమస్యలు ఉంటే.. స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించాలని అధికారులు కోరారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా పంపిణీ చేశారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని ఫాలో కానున్నారు.

నెలకు కేవలం రూ.55లతో.. రూ.3000 పెన్షన్ పొందండి.. ఎలా అంటే..!

కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీని ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి.

మోదీ సర్కార్ కేవలం ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా రైతుల కోసం మరో పథకాన్ని కూడా అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకంలో కూడా రైతులు చేరొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3,000 వస్తాయి. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి.. మన వివరాలను నమోదు చేసి ఈ పథకంలో చేరొచ్చు.

18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో ఇప్పటికే 21,23,809 మంది రైతులు చేరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 60 ఏళ్లు వయసు రాగానే వారికి నెలకు రూ.3వేల పెన్షన్ అందుతుంది. ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో చేరడానికి ఆధార్ కార్డు, పొలం పట్టా, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. 18 ఏళ్ల వయస్సు ఉన్న రైతు ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 కట్టాల్సి ఉండగా.. 40 ఏళ్లలో చేరిన రైతు నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా వయస్సును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇలా 20 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రైతులకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఒక వేళ రైతు మరణిస్తే నామినీకి 50 శాతం డబ్బులు చెల్లిస్తారు.

రైతులకు గుడ్ న్యూస్.. కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల

అన్నదాతలకు కేంద్రప్రభుత్వం తీపీ కబురును అందించింది. చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను సోమవారం విడుదల చేయనునుంది. ఈ పథకం కింద 9.75 కోట్ల రైతులకు 19,500 కోట్ల రూపాయలు అందనున్నాయి. ప్రధానమంత్రి మోడీ మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేయనున్నారని ప్రధాని ఆఫీస్‌ ట్విట్టర్‌లో తెలియజేసింది.

ఏడాదికి 6వేల చొప్పున పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందజేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని నాలుగు నెలలకు 2వేల చొప్పున రైతుల ఖాతలో జమా చేస్తున్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 16 న రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు..!

తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల వేళ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారందరికీ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ రుణాలను దశల వారీగా మాఫీ చేస్తూ వస్తోంది. మొదట రూ. 25 వేలలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణాలను మాఫీ చేసింది. అయితే ఇటీవల రూ.50 వేల వ‌ర‌కు రైతు రుణాల‌ను మాఫీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

దీనిని కూడా ఆగ‌స్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణ‌మాఫీ న‌గ‌దు మొత్తం జ‌మ‌కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి న‌గ‌రంలోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 42 బ్యాంకుల అధికారులు భేటీకి హాజ‌ర‌య్యారు.

సంద‌ర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 50 వేలలోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేల‌లోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయి.

బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు‌ సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. 6 లక్షల మంది రుణమాఫీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ మెుత్తాన్ని జమ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై చర్చించేందుకు 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రూ.50 వేల లోపు రుణాలన్నీంటిని మాఫీ చేయాలని బ్యాంకులకు సూచించింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి బ్యాలెన్స్ చూపించి.. కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని కొరింది.