Tag Archives: hyper aadi

Hyper Aadi: ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి హక్కున చేర్చుకుంది ఆయనే.. ఎమోషనల్ అయిన ఆది?

Hyper Aadi: తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

Hyper Aadi: నోటి దూలతో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది… భారీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నటువంటి ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ఎమోషనల్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో భాగంగా హైపర్ ఆది పొట్టి నరేష్ తో కలిసి స్కిట్ చేశారు. ఈ స్కిట్ అందరిని పెద్ద ఎత్తున నవ్వించింది. ఈ స్కిట్ అనంతరం జబర్దస్త్ రాము మాతృదేవోభవలోని ఓ పాటకు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈయన చేసినటువంటి ఈ పర్ఫామెన్స్ అక్కడ ఉన్నటువంటి వారందరి చేత కంటతడి పెట్టించింది.

ఆకలి బాధలు తీర్చారు..

ఈ పర్ఫామెన్స్ అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను కెరియర్ పరంగా ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి అదిరే అభి అన్న ఒక కారణం. అయితే నేను కష్టాలలో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి హక్కున చేర్చుకున్నటువంటి వారిలో రాము అన్న ఒకరు అంటూ ఈ సందర్భంగా ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Hyper Aadi: ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి అదే కారణమా.. దోషం పోవాలంటే అలా చేయాలా?

Hyper Aadi: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేశారు ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా హైపర్ ఆది ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికే సింగిల్ గానే ఉంటున్నారు. హైపర్ ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎక్కడికి వెళ్లిన తన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది తనకు ఎందుకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి బట్టలలో ఈ కార్యక్రమంలో కనిపించినటువంటి ఈయన తాగుబోతు రమేష్ ద్వారా తనకు పెళ్లి కాకపోవడానికి కారణాలను తెలియజేశారు ఇప్పటివరకు తనకు పెళ్లి కాకపోవడానికి కారణం జాతకంలో దోషమేనని తెలిపారు. తన జాతక దోష పరిహారం కోసం తనకు ముందుగా ముసలామెతో పెళ్లి జరిగితే పెళ్లి జరుగుతుంది అంటూ రమేష్ తెలిపారు.

జాతకంలో దోషమే కారణమా..
ఇలా జాతకంలో దోషం తొలగిపోవడానికి వృద్ధురాలితో పెళ్లి చేయాలని చెప్పారు. అయితే తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు అంటూ హైపర్ ఆది తెలిపారు. ఇలా తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రాకపోవడంతోనే జాతకంలో దోషం అలాగే ఉండిపోయిందని అందుకే నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు అంటూ హైపర్ ఆది తెలిపారు. అయితే ఇది నిజం కాదని కేవలం స్కిట్ లో భాగమని తెలుస్తుంది.

Hyper Aadi: బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని ఉన్న వెళ్లలేము.. అసలు విషయం చెప్పిన హైపర్ ఆది?

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర కమెడియన్ గా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి హైపర్ ఆది ప్రస్తుతం వెండితెరపై కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి హైపర్ ఆది తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ రష్మీ వంటి వారందరూ కూడా పాల్గొనబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వీళ్లు మాత్రం బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన దాఖలాలు లేవు అయితే తాజాగా ఈ విషయం గురించి ఆది మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మేము ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో లలో పనిచేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ మాకు అగ్రిమెంట్ ఉంటుందని ఈ కార్యక్రమాలలో తప్ప మేము ఇతర చానల్లో లాంగ్ టర్న్ షోస్ చేయకూడదని హైపర్ ఆది తెలిపారు. ఇలా అగ్రిమెంట్ లో ఉంటుందని ఈయన తెలిపారు. అయితే ఈ టీవీ షోస్ చేస్తూ సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఇతర షోస్ చేయడానికి మాకు అవకాశం లేదు.

అగ్రిమెంట్ ఉంటుంది…

ఒకవేళ ఇతర కార్యక్రమాలలో కనిపించాలి అంటే ఒకటి రెండు ఎపిసోడ్లకు మినహాయింపు ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ షోస్ చేయాలి అంటే కుదరదని అందుకే మేము బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం కుదరదు అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వన్డే ఎపిసోడ్ కి మాత్రమే అటెండ్ అవుతూ ఉంటాను తప్ప పూర్తిగా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం తనకు లేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

Hyper Aadi: అమ్మాయిని అల్లరి చేసిన హైపర్ ఆది.. చితకబాదిన ఒంగోలు ప్రజలు!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్న ఆది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఆది చేసే కామెడీ స్కిట్లు కనక చూస్తే ఈయన అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ ఉంటారు. ఇలా అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ వారిపై సెటైర్స్ వేసి ఒంగోలులో ఓ అమ్మాయిపై ఇలాంటి కామెంట్లు చేస్తూ అల్లరి పాలు చేయబోయారట దీంతో హైపర్ ఆది నుంచి అప్పట్లో ఒక వార్త ఈ వార్తలపై స్పందించారు.

ఆది జోర్దార్ సుజాతగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు దీంతో సుజాత ఒంగోలులో ఓ అమ్మాయిని అల్లరి చేయబోతే మస్తు కొట్టారంటగా అంటూ ఈయనని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఆది స్పందిస్తూ నేను స్కిట్లలో తప్ప అమ్మాయితో బయట మాట్లాడను ఆ స్కిట్ అయిపోతే నేను అమ్మాయిలతో అసలు మాట్లాడానని నాకు అలవాటు లేదని ఈయన తెలిపారు.

అమ్మాయిలతో నేను అసలు మాట్లాడను..

అమ్మాయిలను అల్లరి చేస్తుంటే నన్ను కొట్టారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని అది క్లారిటీ ఇచ్చారు. హైపర్ ఆది ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలో గల చిన్న గ్రామంలో పుట్టాడు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో హైపర్ ఆది ఓ అమ్మాయి కారణంగా తన్నులు తిన్నారనే వాదన రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు.

Hyper Aadi: పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా.. పొలిటికల్ ఎంట్రీపై ఆది కామెంట్స్!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది మెగా అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఆది విపరీతమైనటువంటి అభిమానాన్ని చూపిస్తుంటారు. ఇక ఈయన ఇటీవల కాలంలో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున మాట్లాడి వార్తలలో నిలిచారు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఆది స్పందించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ ప్రొఫెషన్ వేరు పాలిటిక్స్ వేరని తెలిపారు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమమని తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు రోజా గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు ఆమె రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని తనతో నాకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని ఆయనని వ్యక్తిగతంగా ఎవరైనా దూషిస్తూ తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను పవన్ కళ్యాణ్ ఎవరి వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. ఆయన ఎన్నికలలో గెలవాలని నేను కోరుకుంటాను ఈసారి కూడా ఎన్నికలలో నేను జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు..

పవన్ గెలవాలని కోరుకుంటా..

ఇక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం నాకు కనక వస్తే పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం నేను గెలుస్తానని హైపర్ ఆది కామెంట్ చేయడంతో ఈయన జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నానని టికెట్ ఇస్తే ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా సిద్ధమేనంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Kumari Aunty: మరో బుల్లితెర షోలో సందడి చేసిన కుమారి ఆంటీ…ఈమెను నాశనం చేసేదాకా వదిలేలా లేరే?

Kumari Aunty: నాన్న బుజ్జి కన్నా అంటూ తన ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె హైదరాబాద్లో ఫుట్ పాత్ పక్కన బిజినెస్ జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఈమె పాపులారిటీ ఎంత అంటే ఏకంగా టీవీ షోస్ లో వచ్చే అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె పేరుతో డిజె సాంగ్ క్రియేట్ చేసే అంతగా పాపులర్ అయ్యారు.

ఇలా ఫుడ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నటువంటి ఈమెను ఏకంగా బుల్లితెర సెలబ్రిటీగా మార్చేశారు. ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి కుమారి అంటే తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ కార్యక్రమంలో 90s వెబ్ సిరీస్ టీం కూడా పాల్గొని సందడి చేశారు. ఇక కుమారి ఆంటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పటిలాగే అందరికీ నాన్న బుజ్జి అంటూ ఫుడ్ పెడుతూ సందడి చేశారు. ఇలా ఈమె ఆ నాన్న ఏం కావాలి చెప్పు అంటూ మాట్లాడటంతో హైపర్ ఆది కలుగజేసుకొని ఇదే అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు.

అసలైన బిజినెస్ ట్రిక్..

ఇలా కుమారి ఆంటీ తాజాగా ఈ కార్యక్రమంలో కనిపించడంతో పలువురు ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా బుల్లితెర కార్యక్రమాలకు తీసుకువచ్చి తన బిజినెస్ మరింత పాపులర్ చేశారని కామెంట్లు చేయగా మరికొందరు ఈమెను ఇలా తీసుకువచ్చి సెలబ్రిటీ వచ్చేసి తర్వాత తనకు తన బిజినెస్ పట్ల కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నారని ఇలా ఇప్పటికే ఎంతోమంది జీవితాలతో బుల్లితెర షోస్ ఆడుకున్నాయని ఇప్పుడు ఈమెను కూడా నాశనం చేసే వరకు వదిలేలా లేరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Hyper Aadi: ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి దోషమే కారణమా… బయటపెట్టిన జ్యోతిష్యుడు?

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి హైపర్ ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైన మల్లెమాల వారి నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకుని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినీ కెరియర్ పరంగా ఎంతో మంది సక్సెస్ అయినటువంటి ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

తనకన్నా ఎంతో వెనకగా జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయమైనటువంటి వారు కూడా పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సెటిల్ అయినప్పటికీ ఆదిమాత్రం నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్న ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈయనకు పెళ్లి కాకపోవడానికి కారణం కూడా ఉందని తాజాగా ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయనకు జాతకంలో దోషం ఉందని ఆ దోషం కారణంగానే పెళ్లి కావడం లేదని తెలిపారు.

హైపర్ ఆది జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగిపోయి పెళ్లి జరగాలి అంటే ముందుగా ఈయన ఒక ముసలావిడను పెళ్లి చేసుకోవాలని అలా పెళ్లి చేసుకుంటే ఆ దోషం తొలగిపోతుందని అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంటూ జ్యోతిష్యుడు చెప్పారు అయితే జ్యోతిష్యుడు ఇలా చెప్పడంతో వెంటనే ముగ్గురు వృద్ధ మహిళలు హైపర్ ఆదిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు అయితే ఇందులో ఒకరిని హైపర్ ఆది రిజెక్ట్ చేయగా మరొకరు ఆదినే రిజెక్ట్ చేసి వెళ్లిపోయారు.

వృద్ధురాలితో పెళ్లి..

ఇక మూడో మహిళతో కమిట్ అయినప్పటికీ ఆమె వృద్ధురాలు కాదని వృద్ధుడు అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఇదంతా కూడా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం స్కిట్ లో భాగంగా చేశారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Hyper Aadi: జీతం వస్తే డబ్బులు అన్ని వడ్డీలకే సరిపోయేవి.. ఫ్యామిలీ కష్టాలు బయటపెట్టిన ఆది!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నటువంటి ఈయన తమ స్కిట్లకు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేసేవారు. అలాగే తక్కువ సమయంలోనే టీం లీడర్ గా కూడా మారిపోయారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఈ కార్యక్రమానికి దూరమైనటువంటి ఆది వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆది తన ఫ్యామిలీ గురించి అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తమ తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు సంతానమని అయితే మమ్మల్ని చదివించడం కోసం మా నాన్న ఎన్నో అప్పులు చేశారని తెలిపారు. తాను మొదట్లో జాబ్ చేస్తూ వచ్చే సాలరీ మొత్తం ఈ అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోయేది ఇలా వడ్డీలు చెల్లిస్తూ ఉంటే ఇలాగే ఉంటామని చెప్పి ఉన్న మూడు ఎకరాల పొలం కాస్త అమ్మేసామని అది తెలియజేశారు. ఇక తన తండ్రి కూడా చిన్నప్పటినుంచి నాటకాలు వేసే వారని ఆయన లాగే నాకు కూడా నాటకాలపై ఆసక్తి కలిగి ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.

హీరోగా రావాలని ఆలోచన లేదు…

ప్రస్తుతం స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నటువంటి మీరు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ తయారు చేసి హీరోగా ఎప్పుడు రాబోతున్నారు అంటూ కూడా ఈయనకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ స్క్రిప్ట్ రెడీ చేయాలి అంటే అంత సులువైన విషయం కాదని ప్రస్తుతం నేను కమిట్ అయినటువంటి వాటన్నింటినీ పక్కన పెడితేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఇక హీరోగా తాను ఎప్పుడూ కూడా నటించాలని అనుకోవడం లేదని ఆది తెలిపారు. ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ప్రాజెక్టులతో చాలా సంతోషంగా ఉన్నానని ఈయన వెల్లడించారు.

Hyper Aadi: హీరోయిన్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్న కమెడియన్ హైపర్ ఆది… ఎవరంటే?

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన ముందుగా జబర్దస్త్ కార్యక్రమానికి కమెడియన్ గా వచ్చి అనంతరం టీం లీడర్ గా మారిపోయారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆది సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది ఏదైనా ఒక స్కిట్ చేసిన లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హైపర్ ఆది పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈయన హీరోయిన్ తో కలిసి పెళ్లి పీటలేకపోతున్నారంటే ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అయితే నిజంగానే హైపర్ ఆది హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈయన ఢీ షోలో సినిమా ప్రమోషన్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ తో కలిసి పెళ్లికి సిద్ధమైనట్లు నటించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

ఏడడుగులు నడిచిన ఆది….

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమాలోని హీరోయిన్ హ్రితికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. సౌండ్ పార్టీ సినిమా ప్రమోషన్లలో భాగంగా సన్నీ హ్రితిక ఇద్దరు కూడా ఈ షోలో సందడి చేశారు. ఆది ఆమెను చూడగానే ఆది .. పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడమే కాకుండా తనతో కలిసి వేదికపైనే ఏడడుగులు నడిచారు. అయితే ఇదంతా చూసినటువంటి అందరూ కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Hyper Aadi: ప్రముఖ యాంకర్ తో పెళ్లికి సిద్ధమైన హైపర్ ఆది…ఆ యాంకర్ ఎవరో తెలుసా?

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఆది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తరచు ఈయన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి.

ఈ సందర్భంగా హైపర్ ఆది పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడంతో తరచూ ఈయన పెళ్లి గురించి వార్తలు వినపడుతుంటాయి. అయితే తాజా సమాచారం ప్రకారం హైపర్ ఆది పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఓ వార్త సంచలనంగా మారింది. హైపర్ ఆది ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయంలో ఒక యూట్యూబ్ యాంకర్ తనకు చాలా అండగా నిలబడి తాను బుల్లితెరపై సక్సెస్ సాధించడానికి దోహదపడ్డారట.ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయం ప్రేమగా మారింది అయితే వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఇలా రెండు కుటుంబాల నుంచి అనుమతి రావడంతో హైపర్ ఆది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది.

Hyper Aadi: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు కుటుంబాలు.


ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోవడంతో త్వరలోనే నిశ్చితార్థం చేసుకుని అనంతరం ఘనంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు హైపర్ ఆది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈయన పెళ్లి చేసుకోబోయే ఆ యూట్యూబ్ యాంకర్ ఎవరు ఏంటి అనే విషయాలన్నింటిని కూడా ఈయన త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.