తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట: తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వాకాడు తహసీల్దార్ రామయ్య తన పరిధిలో పనిచేసే మహిళా గ్రామ రెవెన్యూ అధికారిణి (వీఆర్ఓ)ను లైంగికంగా వేధించడంతో పాటు, ఆమె ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మరింత సంచలనం సృష్టించాయి.

తహసీల్దార్ రామయ్య వేధింపుల తీరు
సూళ్లూరుపేట వాకాడు తహసీల్దార్‌గా ఉన్న రామయ్య, గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. అప్పుడే అక్కడి వీఆర్ఓతో పరిచయం ఏర్పడింది. వీఆర్ఓ ఆరోపణల ప్రకారం, రామయ్య పలుమార్లు తనను లైంగికంగా వేధించాడు. బదిలీ అయి వాకాడుకు వెళ్లిన తర్వాత కూడా వేధింపులు ఆపలేదు. అసభ్య మెసేజ్‌లు, వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ చేస్తూ వేధించేవాడని వీఆర్ఓ పేర్కొన్నారు. “మీ ఇంటికి వస్తా, కోడికూర వండుతావా? అడిగితే ఇస్తావా?” వంటి మెసేజ్‌లు పంపినట్లు ఆమె తెలిపింది.
ఇంటికెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నం, తల్లి ప్రతిఘటన
బుధవారం రాత్రి రామయ్య వీఆర్ఓ ఇంటికి వచ్చి, కోరిక తీర్చమని ఒత్తిడి చేయడంతో పాటు, నగ్నంగా నిలబడి వేధించాడని ఆమె ఆరోపించారు. ఇదంతా ముందే తన తల్లికి చెప్పిన వీఆర్ఓ, రామయ్య గదిలోకి వచ్చిన వెంటనే తల్లిని పిలిచింది. వెంటనే కోపంతో రగిలిపోయిన తల్లి చెప్పు, చీపురుతో రామయ్యపై దాడి చేసింది. దీంతో భయపడ్డ రామయ్య వెంటనే బట్టలు వేసుకుని పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రామయ్య వాదన, ఉన్నతాధికారుల స్పందన
అయితే, ఈ సంఘటనపై రామయ్య వాదన వేరేలా ఉంది. వీఆర్ఓతో తనకు గతంలోనే సన్నిహిత సంబంధం ఉందని, పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లినట్లు అంగీకరించాడు. కానీ ఇప్పుడు ఆ సంబంధం క్షీణించడంతో, ఆమె తనపై ఉద్దేశపూర్వకంగా కేసు పెడుతోందని రామయ్య ఆరోపిస్తున్నాడు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. రెండు వైపుల వాదనలను, వీడియో సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్ రామయ్య, వీఆర్ఓ ఇద్దరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగుల్లో నైతికతపై ప్రశ్నలు
ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల్లో నైతికత, మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

































