Tamannah: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా తమన్నా పెళ్లి గురించి తరచు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఈమె ముంబైకి చెందిన ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతుందని అయితే ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్న కేవలం తన ఆస్తిని చూసి ఈమె పెళ్ళికి సిద్ధమైనది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా సున్నితంగా ఆ వార్తలు ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేశారు.
ఇకపోతే తమన్నా తన తదుపరి సినిమాలతో బిజీగా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలలో తమన్నా మెహేంది పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారా అందుకే మెహేంది ఫోటోలను షేర్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Tamannah: పెళ్లికి సిద్ధమైన తమన్నా…
ఈ విధంగా తమన్నా మెహేంది ఫోటోలను షేర్ చేయడంతో ఎంతోమంది నెటిజన్ లు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. అయితే ఈమె పెళ్లికి సిద్ధమయి తన మెహేంది ఫోటోలను షేర్ చేశారా? లేకపోతే ఏదైనా కార్యక్రమంలో భాగంగా ఇలా సందడి చేస్తున్నారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





























