Tammannah: తమన్నాతో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన విజయవర్మ…. ఏమన్నారో తెలుసా?

0
29

Tammannah: మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట న్యూ ఇయర్ వేడుకలలో బీచ్ లో ఇద్దరు కలిసి సందడి చేయటంతో వీరి డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఇద్దరూ పలుమార్లు జంటగా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇద్దరూ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ ఇద్దరూ డేటింగ్ చేయడం లేదని వారి రిలేషన్ ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు.

అయినప్పటికీ వీరిద్దరూ కూడా జంటగా మీడియా కంట పడటంతో వీరి డేటింగ్ గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి..ఇదిలా ఉండగా తాజాగా తమన్నాతో డేటింగ్ గురించి విజయ్ వర్మ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. సోనాక్షి సిన్హా కీలకపాత్రలో నటించిన దాహత్ అనే వెబ్ సిరీస్ లో విజయవర్మ నటించాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ని తమన్నాతో రిలేషన్ గురించి మరొక నటుడు ప్రశ్నించగా..విజయ్ వెంటనే సిగ్గుపడుతూనే తాను తమన్నతో డేటింగ్ లో ఉన్నట్లు చెప్పకనే చెప్పేసాడు.

ఇక ఇలా విజయ వర్మ నేరుగా ఒప్పుకోవడంతో ఎప్పటినుండో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారానికి ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకాలం డేటింగ్ గురించి సీక్రెట్ మైంటైన్ చేసిన విజయవర్మ ఎట్టకేలకు అసలు విషయం బయట పెట్టాడు. తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ మొదటిసారిగా లవ్ స్టోరీ 2 షూటింగ్లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.


Tammannah: తమన్నా ప్రేమలో విజయ్ వర్మ…

ఇదిలా ఉండగా ప్రస్తుతం తమన్నా తెలుగు హిందీ తమిళ్ భాషలలో అడపాదప సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక మరొకవైపు విజయవర్మ కూడా ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ అప్పటినుండి తెలుగు సినిమాలలో కనిపించలేదు.