Josh Ravi: నాగచైతన్య హీరోగా వెండితెర అరంగ్రేటం చేసిన జోష్ సినిమాలో నటించడం వల్ల జోష్ రవిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా జోష్ రవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయనకు జోష్ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయిన మీకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని ప్రశ్నించగా అందుకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

సినిమా పేర్లు మన పేరు ముద్దు ఎవరు పెట్టుకోరు ఆ సినిమాలో అతని క్యారెక్టర్ నచ్చితేనే ప్రేక్షకులు ఆ నటుడికి సినిమా పేరును తన పేరుకు ముందుగా పెట్టుకుంటారు.ఇక జోష్ సినిమా కమర్షియల్ హిట్ కాలేదని చెప్పలేము చాలా మందికి ఈ సినిమా నచ్చింది అందులో నా పాత్ర నచ్చడం వల్ల ఇలా నాకు ఆ పేరు వచ్చిందని వెల్లడించారు.

ఇక జోష్ రవి సినిమాల గురించి మాట్లాడుతూ తన కెరియర్ తేజ గారి దగ్గర ప్రారంభమైందని హైదరాబాద్లో అడుగుపెట్టగానే అవకాశాల కోసం ఆయన దగ్గరకు వెళ్లాలని తెలియజేశారు. ఇక నాన్న కూడా రంగస్థల నటుడు కావడం వల్ల తాను సినిమాల్లోకి వస్తానంటే అడ్డుచెప్పలేదు. ఈ విధంగా నాన్న వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని జోష్ రవి వెల్లడించారు.
అవకాశాల కోసం ఎవరిని అడగలేదు..
ఇకపోతే నాన్న తనికెళ్ళ భరణి గారు మంచి స్నేహితులని ఈ సందర్భంగా జోష్ రవి వెల్లడించారు. ఇక తనికెళ్ళ భరణి గారు నాన్నగారి స్నేహితుడు అయినప్పటికీ ఆయనని మీరు అవకాశాలు అడగలేదా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ఎప్పుడు ఎవరిని నోరు తెరిచి అవకాశాలు అడగలేదని తన టాలెంట్ చూసి, ఆడిషన్ టెస్ట్ పెట్టిన తర్వాతే అవకాశాలు ఇవ్వమని చెప్పేవాడినని వెల్లడించారు.ఇక తనికెళ్ల భరణి గారిని కూడా ఎప్పుడు అవకాశాలు అడగలేదు కానీ ఏదైనా ఒక సినిమాలో నాకు సరిపోయే పాత్ర ఉండి ఇతరుల రికమండేషన్ వల్ల ఆ పాత్ర నాకు కాకుండా వేరే వాళ్లకు వెళితే ఆ సమయంలో భరణి గారికి ఫోన్ చేసి పరిస్థితి ఇది అని ఆయనకు చెప్పి ఆ అవకాశం నాకు ఇప్పించాలని చెప్పేవాడిని. ఆ సమయంలో భరణి గారు వాళ్ళకి ఫోన్ చేసి ఆ కుర్రాడు బాగా మంచి టాలెంటెడ్, ఆ పాత్రకు కరెక్టుగా సరిపోతారని చెప్పేవారు అంటూ జోష్ రవి ఈ సందర్భంగా తెలిపారు.
































