Jr NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవాలనేదే నందమూరి అభిమానుల కోరిక అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎంతో మంది ఎన్నో సార్లు ప్రస్తావించిన ఈ విషయంపై తారక్ ఎప్పుడు స్పందించలేదు.

2009 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దఎత్తున ప్రచారం నిర్వహించిన ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ అభిమానుల మాత్రం తాను రాజకీయాలలోకి వస్తే చూడాలని ఎంతో ఆశగా ఉన్నారు.ఇలా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇన్నిరోజులు అభిమానులలో ఎన్నో సందేహాలు ఉండేవి.

తాజాగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం నటుడిగా తన కెరియర్ లో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఎన్టీఆర్ తెలిపారు.తాను తరువాత వచ్చే క్షణం గురించి ఆలోచించని ఉన్న ప్రతి ఒక్క క్షణాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తానని ఆయన వెల్లడించారు.
అభిమానులకు నిరాశే…
నటుడిగా నా కెరీర్లో నేను ఎంతో సంతృప్తిగా ఉన్నానని, రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా టిడిపి పార్టీకి మద్దతు తెలుపుతారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ ఇలాంటి వార్త చెప్పడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


































