Taraka Ratna : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ సభకు హాజరై అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్నకు గుండె నొప్పి రావడంతో తనని చికిత్స కోసం బెంగళూరు లోని నారాయణ హృదయాలయ కు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. ఆయన గురించి మాట్లాడుతూ ఆర్టిస్ట్ అలానే మా అసోసియేషన్ మెంబెర్ గా ఉన్న కరాటే కళ్యాణి ఎమోషనల్ అయ్యారు.

అమ్మా అంటూ పిలిచేవారు… ఆయన కోలుకోవాలి…
కరాటే కళ్యాణి మాట్లాడుతూ మా అసోసియేషన్ తరుపున ఎప్పటికప్పుడు తారక రత్న గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నామంటూ చెప్పారు. ఆయనకు చిన్నవయసులో ఇలా జరగడం షాక్ కి గురి చేసిందని కరోనా తరువాత ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అంటూ చెప్పారు.

ఇక ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నారని, అది చాలా సంతోషకరమైన వార్త అంటూ తెలిపారు. తారక రత్నతో కలిసి ఒక సినిమాలో నటించానని అయితే ఆ సినిమా విడుదల కాలేదని, ఆ సినిమా షూటింగ్ సమయంలో తారక రత్న తనను అమ్మా అంటూ పిలిచేవాడని చెప్పి ఎమోషనల్ అయ్యారు కరాటే కళ్యాణి. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ అందరి ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






























