Tarakaratna : నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారక రత్న ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా సినిమాలను చేసినా పెద్దగా విజయాలు తారకరత్న కు రాలేదు. ఒకేరోజు ఎక్కువ సినిమాలను ఒప్పుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు అందుకున్న తారకరత్న హీరోగా చేసిన సినిమాలతో కంటే విలన్ గా రవిబాబు సినిమా ‘అమరావతి’ లో నటనకు నంది అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో రాజకీయ కార్యక్రమాల లో చురుగ్గా పాల్గొంటున్న తారకరత్న కుప్పంలో జనవరి 27 న లోకేష్ మొదలు పెట్టిన పాదయాత్రలో పాల్గొంటూ అక్కడే కుప్పకులారు. ఇక చికిత్స కోసం బెంగళూరు లోని నారాయణ హృదయాలయ కి తరలించి దాదాపు 23 రోజుల పాటు వైద్యులు కష్టపడినా ఆయన నిన్న శివరాత్రి రోజున తుది శ్వాస విడిచారు.

ఎందుకు కుటుంబానికి దూరం అయ్యాడు…
తారకరత్న సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ‘నందీశ్వరుడు’ అనే సినిమాకు క్యాస్ట్యుమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్య రెడ్డి తో ప్రేమలో పడ్డాడు. ఆమెకు అది రెండవ వివాహం కావడంతో తారకరత్న కుటుంబం పెళ్ళికి అంగీకరించలేదు. గుడిలో సన్నిహితులతో కలిసి వెళ్లి పెళ్లి చేసుకున్న తారకరత్న ను కుటుంబం దూరం పెట్టింది. మళ్ళీ కూతురు రిషిక పుట్టిన తరువాతే కుటుంబం తారకరత్నను దగ్గరకు తీసుకుంది. పెళ్లయ్యాక కుటుంబానికి దూరమైన తారకరత్న చెల్లి పెళ్ళికి కూడా వెళ్లలేక పోయాడు.

ఇక సినిమాలను తగ్గించిన తారకరత్న ఇటీవలే ఒక వెబ్ సిరీస్ లో నటించిన అలరించారు. టీడీపీ సపోర్టర్స్ గా ఉన్న తారకరత్న టీడీపీ ఎన్నికల ప్రచారాల్లో చాలా సార్లు పాల్గొన్నాడు. ఇక 2024 లో టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేయాలని భావించిన తారకరత్న అందుకోసం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సభలకు హాజరువ్వుతూ కార్యకర్తల్లో తన స్పీచ్ లతో జోష్ నింపిన తారకరత్న అనుకోని విధంగా పాదయాత్రలో కుప్పకూలడం, ఆపైన మృత్యువుతో 23 రోజులు పోరాడి చివరికి ఓడిపోయారు.































