Tarakaratna Friend Suresh : కుప్పం పాద యాత్రకు వెళ్లి గుండె పోటు రావడంతో నారాయణ హృదయాలయలో 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబాన్నే కాకుండా తెలుగు దేశం కార్యకర్తలకు అలాగే తెలుగు ప్రజలను బాధకు గురిచేసింది. ఇక ఆయన ఈమధ్యనే మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవుతూ ఈసారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం సిద్ధపడుతున్న సమయంలో ఇలా అంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఆయన గురించి వ్యక్తిగత విషయాలను ఆయన స్నేహితుడు సురేష్ పంచుకున్నారు.

కోరిక తీరకుండానే మరణించాడు…
తారకరత్న కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తాడు అలాగే స్నేహితులకు కూడా ఎంతో విలువ ఇస్తాడంటూ సురేరేష్ చెప్పారు. ఇక తనకు తన పెద్దనాన్న హరికృష్ణ అలాగే బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా బాబాయ్ బాలకృష్ణ నే ఆయనకు సినిమాల్లో ఇన్స్పిరేషన్ అంటూ చెప్పారు. తన సంతకం చేతి మీద టాటూ కూడా వేయించుకున్నాడంటూ చెప్పారు. ఇక తనకు సినిమాల్లో విలన్ గా ‘అమరావితి’ సినిమాకు మంచి పేరు రావడంతో మళ్ళీ విలన్ గా చేయాలని అనుకున్నారు తారకరత్న.

అయితే తనకు ఎంతో ఇష్టమైన తన బాబాయ్ తో కలిసి సినిమాలో నటించాలనేది కోరిక అంటూ సురేష్ తెలిపారు. భవిష్యత్ లో బాబాయ్ సినిమాలో విలన్ గా చేయాలని తారక్రత్న ప్లాన్ కూడా చేసుకున్నాడు. ఇక తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, అలాగే అన్న కళ్యాణ్ రామ్, బాబాయ్ బాలకృష్ణ తో కలిసి మనం వంటి ఒక సినిమా చేయాలని కోరిక తారకరత్న కు ఉండేది అంటూ సురేష్ వివరించారు. కానీ అవేవి కోరికలు తీరకుండానే మరణించాడు అంటూ బాధపడ్డారు.































