Tarakaratna relative Prasanna Kumar : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఆయన మరణించి 10 రోజులు కావొస్తుండడంతో ఆయన దశదిన కర్మ కార్యక్రమం మర్చి 2న గురువారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరగనుండగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కార్యక్రమాన్ని జరుపుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి పేర్లు ముఖ్యంగా ఉన్నాయి. నిజానికి కార్యక్రమం జరిపించాల్సింది మోహనకృష్ణ గారే అయినా ఆయన పేరు కార్డులో లేకపోవడం వల్ల చర్చ మొదలయింది. అయితే కుటుంబంలో జరుగుతున్న విషయాలు వేరని బయటకు వినిపిస్తున్న వార్తలు వేరని అపోహలకు క్లారిటీ ఇచ్చారు నందమూరి ఇంటికి అత్యంత దగ్గరగా ఉండే ప్రసన్న కుమార్ గారు. ఆయన ఫిల్మ్ ఛాంబర్ లోనూ పనిచేస్తూ అలానే ప్రొడ్యూసర్ గా సినిమాలను నిర్మించారు.

అదంతా సోషల్ మీడియా ప్రచారం మాత్రమే…
ప్రసన్న కుమార్ గారు తారకరత్న దశదిన కర్మ గురించి మాట్లాడుతూ చిన్నకర్మ కేవలం కుటుంబ సభ్యుల మధ్య చేస్తారు. ఇక పెద్ధకర్మ బంధువులందరినీ పిలిచి చేస్తారు. ఇక తారకరత్న పెద్దకర్మ అందరి సమక్షంలో జరుగుతోంది. మోహన్ కృష్ణ గారే తారకరత్న గారి అస్థికలను కూడా కృష్ణా నదిలో కలిపి వచ్చారు. ఆయన దశ దిన కర్మలో కూడా ఉంటారు. ఇక కార్డు విషయంలో వైరల్ అయిన న్యూస్ గురించి మాట్లాడుతూ అది ప్రింటింగ్ కి ఇచ్చిన చోట జరిగిన తప్పు.

ఇంకా ఫైనల్ గా కార్డు ప్రింట్ అవ్వక ముందే డీజైన్ చేస్తున్న సమయంలో కాపీ బయటకు లీక్ అయింది. కార్డు లో మోహన్ కృష్ణ గారి పేరు ఆ తరువాత బాలకృష్ణ ఆ తరువాత విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఉంది. ఇటు నందమూరి కుటుంబ సభ్యుల పేర్లు అలానే అలేఖ్య రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. విషయం పూర్తిగా తెలియకుండా సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేసారంటూ చెప్పారు.

































