Tarakratna: నందమూరి తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన తారకరత్న పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.

ఇలా హీరోగా పలు సినిమాలలో నటించి అనంతరం విలన్ పాత్రలలో కూడా తారకరత్న నటించారు. ఇలా ఎంతో ఫ్యామిలీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈయన నటనలో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. అయితే ఈ మధ్యకాలంలో తారకరత్న తిరిగి వెబ్ సిరీస్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలోకి కూడా రావాలని తారకరత్న భావించారు. అయితే ఈయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం ఇండస్ట్రీలో తీవ్రవిషధాన్ని నింపింది. ఇక తారకరత్న మరణించడంతో తారకరత్న గొప్పతనం గురించి పలువురు మాట్లాడుతున్నారు. అలాగే తారకరత్న కోసం తమ సినిమాలో ఒక పాత్ర డిజైన్ చేశామంటూ దర్శకనిర్మాతలు చెప్పడం అందరిని కాస్త దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

Tarakratna: తారకరత్న చనిపోయిన తర్వాత ఇలాంటి వార్తలు చెప్పడం ఏంటి…
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో తారకరత్న కోసం ఒక స్పెషల్ రోల్ డిజైన్ చేయమని బాలకృష్ణ తనకు ఫోన్ చేసే స్వయంగా చెప్పారంటూ అనిల్ రావిపూడి తారకరత్న మరణించిన రోజు తెలియచేశారు. ఇక నిర్మాత అశ్విని దత్ సైతం తారకరత్న గురించి మాట్లాడుతూ.. ఆయనది ఎంతో మంచి మనసు అని తన నవ్వు అంటే చాలా ఇష్టం అంటూ తెలిపారు. ఇక తారకరత్న కోసం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో ఒక పాత్ర డిజైన్ చేశారని ఈయన తెలియజేశారు ఇలా తారకరత్న చనిపోయిన తర్వాత దర్శకనిర్మాతలు ఇలా చెప్పడంతో నందమూరి అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.































