Tarun: ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు హీరో తరుణ్. ఈయన ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలలో నటించి హీరోగా సక్సెస్ అవ్వడమే కాకుండా లవర్ బాయ్ అనే ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నారు.

ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో తరుణ్ విపరీతమైన అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణ్ క్రమక్రమంగా తన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అవకాశాలను కోల్పోతూ వచ్చారు. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి తరుణ్ రీఎంట్రీ ఇవ్వాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు.. ఇలా సినిమాలకు దూరమైనప్పటికీ ఈయన మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపించేవారు. అలాగే తన వ్యాపారాలు అన్నింటిని చూసుకుంటూ ప్రస్తుతం బిజీగా ఉన్నారని తన తల్లి రోజా రమణి వెల్లడించారు.
ఇక తరుణ్ త్వరలోనే తిరిగి సినిమాలలోకి రాబోతున్నారని కూడా రోజా రమణి వెల్లడించారు. అయితే తాజాగా తరుణ్ సైతం తన రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు..సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)కి సంబంధించి టాలీవుడ్ టీమ్‌కి తరుణ్ కెప్టెన్ కావడం విశేషం. దీనికి సంబంధించి కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్..
ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ప్రస్తుతం తాను రెండు ప్రాజెక్టులపై పనిచేస్తున్నానని తెలిపారు. అందులో ఒకటి సినిమా కాగా మరొకటి వెబ్ సిరీస్ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని మరొక నెలలో వీటిని అనౌన్స్ చేయబోతున్నట్లు తరుణ్ వెల్లడించారు. దీంతో ఈయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



























