Tarun: తరుణ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పటి లవర్ బాయ్ గా ఎంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి తరుణ్ క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు భావించారు. అదేవిధంగా ఇప్పటివరకు ఈయన ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే తరుణ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తడంతో తన తల్లి రోజా రమణి త్వరలోనే తరుణ్ పెళ్లి జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు. దీంతో తరుణ్ పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తరుణ్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. దీంతో పలువురు ఈ వార్తలపై విభిన్న శైలిలో స్పందించారు.
ఇలా మెగా ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలపై తరుణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమేనని ఈయన కొట్టి పారేశారు. తాను అలాంటి శుభవార్త ఏదైనా ఉంటే ముందుగా సోషల్ మీడియా వేదికగాను మీడియా ముందు తాను తెలియజేస్తానని తెలిపారు.

Tarun: ఆ వార్తలన్నీ అవాస్తవమే…
ఇక తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నీ కూడా ఆ వాస్తవమేనని ఆయన ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు ఏ మాత్రం అర్థం కాదు అంటూ ఈ సందర్భంగా ఇంటికి అల్లుడు కాబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. ఈయన నిహారికను వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి.