AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో అందరి ఆసక్తి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఎన్నికల ఫలితాలకు మరొక ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న విషయం గురించి ఇప్పటికే పలు సర్వేలు కూటమి రాబోతుందని చెప్పగా మరి కొందరు మాత్రం ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారంటూ ఫలితాలను వెల్లడించారు.

ఇక అధికారంలోకి వచ్చేది మళ్లీ జగనేనని ఆయన ముఖ్యమంత్రిగా రెండోసారి వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక జూన్ 9వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు పలువురు రాజకీయ నాయకులు వైజాగ్ కు పయనమయ్యారు.
జగన్ అధికారంలోకి వస్తారనే విషయాన్ని కూటమి నేతలు కూడా ఒప్పుకున్నారనే చెప్పాలి. తెలుగుదేశం సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని గుర్తుచేస్తూ ఎక్స్ లో సెటైర్లు వేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
వైజాగ్ లోనే జగన్ ప్రమాణస్వీకారం..
విశాఖకి టికెట్ ధరలు భారీగా పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్ – జూన్ 8, 9 తేదీల్లో వైజాగ్ లో సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందన్న వైసీపీ – వైజాగ్ కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు, సీఎం జగన్ అభిమానుల ప్లానింగ్ – ఇదే అదనుగా విశాఖకు టికెట్ ధరలు డబుల్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ అంటూ ఈయన ట్వీట్ చేశారు ఈయన చేసిన ఈ ట్వీట్ చూస్తే జగనే గెలుస్తారని విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది.





























