Bonda Uma: విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఘటనలో భాగంగా వేముల సతీష్ వేముల దుర్గారావు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకువెళ్లారు. అనంతరం వీరిని విచారించిన తర్వాత విడుదల చేశారు.

ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన వెనుక బోండా ఉమా హస్తం ఉందని ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయం గురించి బోండా ఉమా ఓపెన్ అయ్యారు. అవును దుర్గారావు నా మనిషి అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వేముల దుర్గారావు నా మనిషేనని బోండా ఉమా తెలిపారు.తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి. మా పార్టీ ఆఫీసు పక్క రోడ్డులోనే ఉంటాడు. నిత్యం పార్టీ ఆఫీసు దగ్గరే కూర్చుంటాడు. అది వాస్తవం. రాయి వేశాడని పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి వేముల సతీశ్. వేముల సతీష్ దుర్గారావు ఇంటిపేర్లు ఒకటే అయినప్పటికీ వారిద్దరి మధ్య బంధుత్వం ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని తెలిపారు.
రాయి దాడికి దుర్గారావుకు సంబంధం లేదు..
ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటనలో భాగంగా వేముల దుర్గారావుకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని బోండా ఉమా తెలియజేశారు. అయితే బోండా ఉమా దుర్గారావు తన మనిషి అని ఒప్పుకోవడంతో ఈ ఘటన వెనుక తన ప్రమేయం ఉందని పలువురు ఆ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటమి భయం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, పోలీసులు ఈ విషయంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి తప్పనిసరిగా ఈ దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.





























