AP politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ నెలకొంది. ఈసారి రెండు పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ ఉన్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసిపికి ఓటమి భయం పట్టుకుందని ఈయన వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు లేవని అలాగే ఏపీని మొత్తం అప్పుల కూబిలో ఉంచారని తెలిపారు.
వైసిపి ఎమ్మెల్యేలు ప్రజలలోకి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదని కేసినేని చిన్ని తెలిపారు. ప్రజలందరూ మార్పుకు సిద్ధమయ్యారని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక విజయవాడలో అన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని చిన్ని తెలిపారు.
సీట్లను త్యాగం చేశారు..
విజయవాడ అభివృద్ధి మొత్తం టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 80శాతం పూర్తి చేసింది టీడీపీనే అన్నారు. అమరావతి రావాలి యువత బాగుపడాలి అని పిలుపునిచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈయన మాట్లాడారు. ఈయన పొత్తులో భాగంగా 21 సీట్లు మాత్రమే తీసుకున్నారంటూ చాలామంది విమర్శలు చేశారు అయితే ప్రజల కోసమే ఈయన సీట్లను త్యాగం చేశారంటూ చిన్ని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.





























