Allu Arjun-Team India Cricketers: అల్లు అర్జున్ నటించిన ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అతడి సినిమాలోని మ్యూజిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. అందుకే అతడి సినిమాలోని పాటలు మంచి రెస్పాన్స్ వస్తుంటాయి.

అంతక ముందు అల్లు అర్జున్ కు సంబంధించిన సినిమా అల వైకుంఠపురం సినిమాలో థమన్ అందించిన మ్యూజిక్ యూట్యూబ్ లో ఓ సంచలనాన్ని క్రియేట్ చేశాయి. ఆ వీడియోలకు కొన్ని వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతే కాదు.. బుట్టబొమ్మ సాంగ్, సామజవరగమన సాంగ్స్ చాలామందికి రీచ్ అయ్యాయి.

ఇక క్రికెటర్లు కూడా ఆ సినిమాలోని పాటలను రీల్స్ చేస్తూ అలరించారు. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ సాంగ్ ను రీల్ చేసి అలరించాడు. అంతే కాదు ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోని సాంగ్స్ కు కూడా అతడి డ్యాన్స్ వేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అవి పెద్ద వైరల్ గా మారాయి.
పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు స్పూఫ్ ల వెల్లువ..
అంతే కాదు పుష్ప సినిమాలో వైరల్ గా మారిన తగ్గేదేలే అనే డైలాగ్ ను డేవిడ్ వార్నర్ తో పాటు.. టీం ఇండియా ఆల్ రౌండర్ జడేజా కూడా చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి వైరల్ గా మారాయి. దీనికి అల్లు అర్జున్ కూడా స్పందించడం విశేషం. ఇలా అల్లు అర్జున్ కు సంబంధించిన స్పూప్ లను ఎక్కువగా డేవిడ్ వార్నర్ చేస్తూ ఉంటాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ లో డేవిడ్ వార్నర్ కీలక ఆటగాడు కావడంతో.. అతడికి తెలుగు అభిమానులు పెరిగిపోయారు. దీంతో అప్పుడుప్పుడు ఇలా వాళ్లను అలరిస్తూ ఉంటాడు. ఇక తాజాగా.. టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా ‘పుష్ప’రాజ్ మాయలో పడిపోయారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు హీరో అల్లు అర్జున్ వేసినట్లు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను స్వయంగా ‘పుష్ప’ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. హిందీ వర్షన్ లో ఉన్న శ్రీవల్లీ సాంగ్ ను డ్యాన్స్ వేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
.@surya_14kumar & @ishankishan51 grooving to the melodious song #Srivalli ????#PushpaTheRise #BoxOfficeSensationPushpa pic.twitter.com/Y399HEAYvt
— Pushpa (@PushpaMovie) January 15, 2022

































