Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా దగ్గుబాటి కాంబినేషన్లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక ఫైట్ సన్నివేశం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

డానియల్ శేఖర్ పాత్రలో నటించిన రానా పై పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్న సమయంలో రానా కుడిచేతిని వెనక్కి తిప్పి పవన్ కళ్యాణ్ తన కుడి కాలుతో భుజంపై తొక్కి పట్టే సన్నివేశం గురించి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అసలు ఈ సన్నివేశాన్ని ఎక్కడి నుంచి తీసుకొని దీన్ని డిజైన్ చేశారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ క్రమంలోనే ఈ టెక్నిక్ రామాయణంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రామాయణంలో హనుమంతుడు శత్రు సంహారం చేసే సమయంలో భీమావతారం ఎత్తి సంహరించిన తీరును ఈ సినిమాలో ‘భీమ్లా పట్టు’గా పవన్ పాత్రకు రూపొందించినట్లు ఇండస్ట్రీ సమాచారం.
భీమ్లా పట్టుకు ఫిదా అవుతున్న నెటిజన్లు…
ఈ విధంగా ఈ ఫైట్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ “భీమ్లా పట్టు” చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు రోజులు అవుతున్న బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్లు తగ్గకుండా దూసుకుపోతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరోసారి ఈ సినిమా ద్వారా తన గర్జన వినిపించారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలో నటించారు.































