Actress Jyothi: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న జ్యోతి అందరికీ సుపరిచితమే. గతంలో ఈమె డ్రగ్స్ వ్యవహారంలో సంచలనంగా మారింది. డ్రగ్ కేసులో భాగంగా జ్యోతి సోషల్ మీడియా వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి తన కెరియర్ లో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తూ ఒక సినిమాలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అనంతరం మిమ్మల్ని తీసేసిన సంఘటనలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తన సినీ కెరియర్ లో అలాంటి సన్నివేశాలు ఏమీ జరగలేదని,ఒకవేళ తను చేయడానికి ఆన్ కంఫర్టబుల్ గా ఉన్నా వెంటనే ఆ సీన్ మార్చమని చెప్పేస్తానని జ్యోతి వెల్లడించారు.

ఇకపోతే డైరెక్టర్ ఈవీవీ గురించి మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద డైరెక్టర్ ఎవడి గోల వాడిది సినిమా ద్వారా తనకు మంచి పాత్ర ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఈవివి సత్యనారాయణ గారు ఏ ఆర్టిస్టుకి వారి పాత్ర గురించి ముందుగా వెల్లడించరు. ఈ క్రమంలోనే ఎవడి గోల వాడిది సినిమా షూటింగ్ కోసం 25 రోజుల పాటు బ్యాంకాక్ వెళ్ళాము. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో తెలంగాణ శకుంతలకు కమెడియన్ కృష్ణభగవాన్ తో బెడ్ రూమ్ సన్నివేశాలు చేయాలని చెప్పారు.
కర్మ సిద్ధాంతం ఫలించింది..
అలా చెప్పడంతో తెలంగాణ శకుంతల ఆ సీన్ లో నటించడానికి బోరున ఏడ్చారు. అయితే ఆ సన్నివేశం మొత్తం కామెడీగా చూపించారని ఈ సందర్భంగా జ్యోతి వెల్లడించారు.ఇక తన డ్రగ్స్ వ్యవహారం గురించి మాట్లాడుతూ తనని పూర్తిగా ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని, తన తప్పు ఏమాత్రం లేదని ఈమె తెలియజేశారు. అయితే ఆరోజు నన్ను ఎవరు ట్రాప్ చేశారనే విషయం నాకు తెలుసు అని ఇలా అనవసరంగా తననీ వేధించి నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కుక్క చావు చచ్చారని, వాళ్ల మదర్ వాళ్ళ వైఫ్ అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని ఈ సందర్భంగా జ్యోతి డ్రగ్స్ వ్యవహారం గురించి తెలియజేశారు.

































