Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో పునర్జన్మ ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటించారు . ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతూ అరుదైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈమె నటనకు ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి చేసే డాన్సులకు చాలామంది ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇలా ఒక వైపు సాయి పల్లవిని ప్రశంసిస్తుంటే మరోవైపు కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తమిళనాడులో కొందరు దేవదాసీ పాత్రలో సాయి పల్లవి పెద్దగా అందంగా లేదని ఆమె బాడీ షేమింగ్ గురించి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈ విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళ సై తమిళ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
అందంగా పుట్టక పోవడం మన తప్పు కాదు…
ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ నటి సాయి పల్లవి గురించి కొందరు తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం తనను ఎంతగానో బాధ పెట్టాయని ఈమె తెలిపారు. అలా బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే ఆ మాటలను పడే వారికి ఎంతో బాధ కలిగిస్తాయని తాను కూడా ఆ బాధలను ఎదుర్కొన్నానని ఈమె తెలిపారు. తనని కూడా మొదట్లో పొట్టిగా నల్లగా, రింగుల జుట్టుతో పోలీ ఉన్నానని తన బాడీ షేమింగ్ గురించి కామెంట్లు చేశారు అని చెప్పుకొచ్చారు. అయినా అందంగా పుట్టకపోవడం మన తప్పు కాదు ఇలా పుట్టకుండా ఉండడానికి మనం ఏమి మహాత్ములను కాదు.. అంటూ తమిళసై సాయిపల్లవి విషయంపై స్పందించారు.
In a live TV interview today, highlighted on Body-Shaming & its impact on women.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 27, 2022
No woman should be discriminated on basis of their appearances/looks, color complexion & other physical characteristics.@PMOIndia @HMOIndia @MoHFW_INDIA @PTTVOnlineNews @pibchennai @ANI pic.twitter.com/rsPMLKKc7Z

































