తెలంగాణ సర్కారు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలు మొత్తం మూసేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గడంతో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వ హాస్టల్స్ కు విద్యార్థులు వస్తే.. గుంపులు గుంపులుగా ఉండటంతో మళ్లీ కరోనా సోకే అవకాశం ఉంటుందని.. గురుకులాల్లో ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత చాలా రోజుల తర్వాత ఇంటర్ పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలలను తెరవాలని.. దానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈ రోజు గురుకుల పాఠశాలలను తెరుచుకోవచ్చని హైకోర్టు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు అంటే.. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరుచుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది.
ఇదిలా ఉండగా గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ తరగతులకు బోధనా తరగతులను చేపట్టాలని కూడా స్ఫష్టం చేసింది. ఇక విద్యా సంస్థలో కరోనా వ్యాప్తి పెరకుండా ఉండటం కోసం తగిన జాగ్రత్తులు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
































