తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ పొట్లపల్లి కేశవరావు కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పోందుతూ తెల్లవారిజామున తుదిశ్యాస విడిచారు. ఆయన మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు సోమవారం సెలవు ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్ పొట్లపల్లి కేశవరావు 2017 సెప్టెంబర్ 21 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గం.లకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






























