AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎంత ఉత్కంఠత నెలకొంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరొక కొన్ని గంటలలో ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో అందరి చూపు ఏపీ ఎన్నికల ఫలితాలపైనే ఉందని చెప్పాలి. అయితే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా అయోమయంలోనే ఉన్నారు.

ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయంపై సరైన అంచనాకు రాలేకపోతున్నారు జాతీయ సంస్థలన్నీ కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పగా స్థానిక సర్వే సంస్థలన్నీ కూడా వైసిపి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. అయితే తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయనకు ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఏపీలో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాబోతున్నారని అందులో ఎలాంటి సందేహం లేదని ఈయన తెలిపారు.. ఏపీలో నాకు ఎంతోమంది బందు వర్గం ఉంది. అలాగే స్నేహితులు ఉన్నారు. వారందరి ద్వారా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం తిరిగి జగన్ రాబోతున్నారని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం…
ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ అమ్మఒడి వంటి ఎన్నో సంక్షేమ పథకాలే తిరిగి ఆయనని అధికారంలోకి తీసుకురాబోతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఏపీలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారనేది తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.





























