కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. మన దేశంలో కూడా అనూహ్యంగా పాజిటివ్ కేసులు పెరుగుతూన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడంకోసం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు రోడ్ల మీదికి రావొద్దని ఆంక్షలు విధించారు. ఈ లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా కొంత మంది ఏమి పట్టనట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎదో ఒక వంకతో బయట తిరుగుతూనే ఉన్నారు.. కొందరు పోలీసులు లాఠీ దెబ్బలు కొడుతున్నా… మరి కొందరు పోలీసులైతే రెండు జోడించి దణ్ణం పెట్టి మరి బ్రతిమిలాడుతున్నారు. ఇంతగా చెప్పినా కూడా కొంత మందికి ఆకతాయిలు పోలీసుల మీదే తిరగబడుతున్నారు.

తాజాగా ఈ లాక్ డౌన్ పై తెలంగాణ పోలీసులు ఒక సర్వే నిర్వహించారు. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం చదువుకున్న వారికంటే చదువులేని వారు ఈ లాక్ డౌన్ ను ఎక్కువగా పాటిస్తున్నట్టు సర్వేలో తేలింది. ఈ సర్వేను తెలంగాణ పోలీసుల అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ… “మాకు అందిన సమాచారం ఆధారంగా, చేయబడ్డ చిన్న విశ్లేషణ., చిన్నబుచ్చుకోకుండా, పెద్దమనసు చేసుకుని, ఇంటి వద్దనే ఉండి, మీ బాధ్యత నిర్వర్తించండి.” అంటూ ట్వీట్ చేసారు.
మాకు అందిన సమాచారం ఆధారంగా, చేయబడ్డ చిన్న విశ్లేషణ., చిన్నబుచ్చుకోకుండా, పెద్దమనసు చేసుకుని, ఇంటి వద్దనే ఉండి, మీ బాధ్యత నిర్వర్తించండి. https://t.co/GchVfTUq7q pic.twitter.com/8ve5W1BKpR
— Telangana State Police (@TelanganaCOPs) April 1, 2020





























