Suma Kanakala: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ఒకరు. సుమ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇప్పటికీ సుమా లేకుండా ఏ కార్యక్రమం జరగదు అంటే అతిశయోక్తి లేదు అంతలా ఈమె పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇలా ఒకవైపు సినిమా ఈవెంట్ నిర్వహిస్తూనే మరోవైపు ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రతి శనివారం సుమ అడ్డ అనే పేరిట ఓ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరుకాగా ఈమె వారందరితో సరదాగా ఆటలు ఆడిస్తూ ఉంటారు.
ఇకపోతే వచ్చే శనివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఇందులో భాగంగా సుమ అనాధ వృద్ధులను వేదికపైకి తీసుకువచ్చారు. సుమ పుట్టినరోజు కావడంతో వారందరినీ షోకు పిలిపించి.. వారి మధ్యనే సుమ కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న పెద్దలు ఎమోషనల్ అయ్యారు.
ఓల్డ్ ఏజ్ హోమ్..
వీరందరికీ సుమ ఆశ్రయం కల్పిస్తున్నారని విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఆమె అనాథలైన వృద్ధులను చేరదీస్తున్నారు. ది నెస్ట్ – హోమ్ ఫర్ ది ఏజ్డ్ అనే హోమ్ ద్వారా వారికి అన్ని వసతులు కల్పించి.. సేవ చేస్తున్నారు. ఇలా సుమ వృద్ధుల కోసం ఎంతో గొప్ప మనసు చాటుకొని వారికి ఆశ్రయం కల్పిస్తూ వచ్చారు. అయితే ఈ నెలలో ఎప్పుడు కూడా సుమ ఈ విషయాన్ని బయట పెట్టకపోవడం విశేషం.



























