పూజల పేరుతో ఘరానా మోసం.. ఇలాంటి మోసం ఎక్కడా చూసి ఉండరు.. ?

0
165

టెక్నాలజీ ఎంత ముందుకు దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను ప్రజలు వీడటం లేదు. ఇదే అదునుగా భావించి కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గత కొన్నాళ్లుగా శ్రీనివాస శర్మ పూజారిగా పనిచేస్తున్నాడు. వేద మంత్రాల పేరుతో గ్రామ ప్రజలను నిండా ముంచాడు.
అతను ఉండే ప్రాంతంలో కాకుండా మరో గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్తులను నమ్మిస్తాడు. కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అలా అతడి వద్దకు వచ్చి తమ కష్టాలను చెప్పే మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. ప్రత్యేక పూజలు అంటూ నమ్మించాడు. ఆ పూజలు చేయడం ద్వార ఆర్ధికంగా బలపడతారని మాయమాటలు చెప్పాడు.

అయితే ఆయన మాటలను నమ్మిన గ్రామ ప్రజలు పూజలు చేశారు. ఇక అక్కడి నుంచి తన పంథా మార్చాడు. తనకు బడా వ్యాపారులు తెలుసని.. వారు ఈ పూజలు చేసేందుకు ఇక్కడికి రాలేరని చెబుతాడు. వారు పూజలు చేయడానికి మీరు ఆర్థికంగా సాయం చేస్తే అందులో సంగం కమీషన్ మీకు వస్తుందని నమ్మించేవాడు. ఇలా గ్రామంలో సుమారు నలబై మంది మహిళల వద్ద కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశాడు. చిట్టీల పేరుతో కూడా తమ వద్ద కొన్ని లక్షల రూపాయలను వసలూ చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఓ రోజు తన కూతురుకు కరోనా వచ్చిందని అక్కడ నుంచి జంప్ అయ్యాడు. అయితే వెళ్లిపోయిన కొద్ది రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆన్‌లో పెట్టుకున్న పూజారి ఇటివల ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో విషయం బయటపడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మొబైల్ ఉన్న సిమ్ కూడా గ్రామస్తుల్లో ఒకరి పేరు మీద ఉండటం విశేషం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.