ఈటీవీలో ప్రసారం అవుతున్న బబర్దస్త్ షో తెలియని వారంటూ ఉండరు. ఎవరైనా అలసిపోయినప్పుడు గానీ.. డల్ గా ఉన్న సందర్భంలో చాలామంది జబర్దస్త్ షో చూస్తూ.. కాస్త రిలాక్స్ పొందుతారు. అయితే ఈ షోకి వచ్చే టీఆర్పీ రేటింగ్ మరేషోకి కూడా రాదు. అంతలా ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ షో. ఇలా ఈ వేదికపై ఎంతో మంది ఎదిగా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు.

బుల్లితెరపై స్టార్ స్టేటస్ పొంది.. వెండితెరపైనా మెరిసిన వారున్నారు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాల్లో నటించేవారు చాలామంది ఉన్నారు. ధన్ రాజ్, వేణు, రోలర్ రఘు, అభి వంటి వారు వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చిన వారే. ఇక హైపర్ ఆది, సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, మహేష్ వంటి వారు బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా నిరూపించేందుకు పాట్లు పడుతున్నారు.
Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?
అయితే కొన్ని నెలల క్రితం తాగుబోతు రమేష్ కూడా దీనిలో చేరాడు. అతడు ఒక టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమాల్లో అవకాశాలు రాక ఇటు వైపు వచ్చాడా.. లేదా మరేదైనా కారణం ఉందా తెలియదు కానీ.. ప్రస్తుతం అతడు జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. మళ్లీ సినిమాలో తన ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతో పాటు ఎన్నో యేళ్ల నుంచి ఉంటోన్న జీవన్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ప్రతీ స్కిట్‌లో జీవన్‌ను ఎరుపు అంటూ ఆట పట్టించడం.. పిచ్చోడిని చేయడం జరుగుతూనే ఉంది.

ఇక టీం లీడర్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇద్దరి పరిస్థతి కూడా అంతే ఉంది. ఈ సందర్భంలో తాగబోతు రమేష్ తన అభిమానులకు.. ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. తాను మరో బిడ్డకు తండ్రిని అయ్యానని చెప్పాడు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకుకోగా.. 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అతడికి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు.. అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేశారు. తోటి కమెడియన్లు కూడా అతడికి ఫోన్ చేసి అభినందించారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ చెప్పాడు రమేష్.


































