Thammareddy Bhardwaja : పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవల్ లో చేసిన సినిమా లైగర్. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి పీసీ కార్పొరేషన్ ద్వారా కరన్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నా నేటివిటీకి తగట్టు సినిమా లేకపోవడం వల్ల సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సినిమాకు మొదటి కొద్దిరోజులు కూడా కలెక్షన్స్ లేకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు. దీంతో నష్టాన్ని పుడ్చాలాంటూ పూరి జగన్నాథ్ ను, ఛార్మిని డిమాండ్ చేసారు. ఇక ఈ ఇష్యూలో వారు ధర్నాలు కూడా చేస్తామంటూ బెదిరించిన్న ఆడియోను పూరి లీక్ చేయడంతో ఈ ఇష్యూ మరోసారి వైరల్ అయింది. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడారు.

డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు…
పూరి జగన్నాథ్ కొంతవరకూ నష్టాన్ని భరిస్తానని డిస్ట్రిబ్యూటర్లకు హామీ ఇచ్చారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మాకు న్యాయం చేయాలనీ ధర్నాలు, స్ట్రైకులు చేస్తామనడం కరెక్ట్ కాదు అంటూ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. మార్కెట్ అంత లేని హీరోకి ఎందుకంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొనాలి, అంతకుముందు విజయ్ సినిమాలు ఫ్లాప్. అలాంటపుడు అంత మార్కెట్ లేని హీరోకి అంత డబ్బు పెట్టి కొన్నారు అలా చేయకుండా ఉండాల్సింది.

అయినా కొన్నాక ఇక నిర్మాత నష్టాలొస్తే భరించాలనే నియమం లేదు కానీ బయ్యర్లు నష్టపోతారనే ఉద్దేశంతో డబ్బు ఇస్తారు. కానీ ఇవ్వాలని రూల్ లేదు కాబట్టి ఇప్పుడు పూరి విషయంలో వాళ్ళు ధర్నాలు, స్ట్రైకులు చేయడం తప్పు. ముందు బడ్జెట్ తగ్గించి సినిమాలను సరిగా ప్లాన్ చేసుకుంటే ఇలా అందరూ నష్టపోవాల్సిన పని లేదు కదా, టికెట్ రేట్స్ పెంచి కలెక్షన్స్ రాబట్టుకోవాల్సిన పని లేదా కదా అంటూ అభిప్రాయపడ్డారు.






























